ఇరాక్‌లో చేతులెత్తేసిన మన విదేశాంగ శాఖ...
- January 28, 2017
వీసా లేనివారిని జరిమానా చెల్లించకుండా పంపించలేమంటున్న ఎంబసీ అధికారులు
మోర్తాడ్: ఇరాక్‌లో చట్ట విరుద్ధంగా ఉంటున్న తెలంగాణవాసులను ఇళ్లకు రప్పించడానికి చర్యలు తీసు కుంటామని విదేశాంగశాఖ మంత్రి సుష్మాస్వరాజ్ చేసిన ప్రకటనకు భిన్నంగా ఇరాక్‌లోని మన ఎంబసీ అధికారులు వ్యవహరిస్తున్నారు. వీసా గడువు ముగిసినా ఇరాక్‌లో ఉండిపోయినవారు సొంత దేశా లకు వెళ్లాలంటే నిబంధనల ప్రకారం జరిమానా చెల్లించాలని అక్కడి ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇరాక్‌లో ఉపాధి కోసం ఒక్కో కార్మికుడు రూ.1.25 లక్షల నుంచి రూ.1.50 లక్షల వరకు ఖర్చు చేసి వీసా పొందారు. ఇరాక్‌లో వర్క్ వీసా అని చెప్పి విజిట్ వీసా ఇచ్చిన ఏజెంట్లు తెలంగాణ కార్మికులను వం చించిన విషయం విదితమే.
ఇరాక్‌లో వర్క్ పర్మిట్, వీసా లేకుండా ఉన్నవారు రెండువేల డాలర్ల జరి మానా చెల్లించాలని అక్కడి ప్రభుత్వం పేర్కొంది. ఇంటికి రావడానికి విమాన చార్జీల కోసం మరో 600 డాలర్లు ఖర్చు చేయాల్సి ఉంది. ఈ లెక్కన ఒక్కో కార్మికుడు రూ.1.50 లక్షల నుంచి రూ.1.80 లక్షల వరకు భరించాలి. ఇప్పటికే అప్పుల ఊబిలో కూరుకు పోయిన తాము ఏజెంట్ల మూలంగా ఇరాక్‌లో పనిలేక పస్తులుంటున్నామని మళ్లీ ఇంటికి రావడానికి డబ్బులు చెల్లించాలనడం సమంజసంగా లేదని కార్మి కులు అంటున్నారు. ఇరాక్‌లో 500 మంది తెలం గాణవాసులు చట్ట విరుద్ధంగా ఉన్నారు. ఇందులో 33 మంది గల్ఫ్ తెలంగాణ అధికార ప్రతినిధి పాట్కూరి బసంత్‌రెడ్డి, ఇరాక్‌లో ఒక కంపెనీలో పని చేస్తున్న జన్నారంవాసి మాటేటి కుమార్‌ల చొరవతో జరిమానా చెల్లించకుండానే ఇంటికి చేరుకున్నారు. మిగిలినవారు ఇరాక్‌లో ఉండిపోయారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







