‘నేత్ర’ ఫిబ్రవరి 3న...

- January 29, 2017 , by Maagulf
‘నేత్ర’ ఫిబ్రవరి 3న...

స్టార్‌ మేకర్‌ సత్యానంద్‌ తనయుడుతో కలిసి మొట్ట మొదటిసారిగా నటిస్తోన్న చిత్రం ‘నేత్ర’. మై స్వీట్‌ హార్ట్‌ అనేది ట్యాగ్‌లైన్‌. రామ్‌ కియేషన్స్‌ పతాకంపై పీరికట్ల రాము నిర్మిస్తున్నారు. గోపీచరణ్‌, ఐశ్వర్య అడ్డా జంటగా నటించగా..  రెడ్డెం యాదకుమార్‌ దర్శకత్వం వహించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 3న విడుదల‌కు సిద్ధమైంది. 
నిర్మాత పీరికట్ల రాము మాట్లాడుతూ... ‘అన్ని వర్గాల‌ ప్రేక్షకులు నచ్చేలా ఈ చిత్రం ఉంటుంది. స్టార్‌ మేకర్‌ సత్యానంద్‌గారు, వారి అబ్బాయి తొలిసారిగా మా చిత్రంలో నటించారు. సినిమాను చూసి సెన్సార్‌ వారు  కూడా ప్రశంసించారు. ఫిబ్రవరి 3న అత్యధిక థియేటర్లలో విడుదల‌ చేస్తున్నాం’ అన్నారు.
చిత్ర దర్శకుడు రెడ్డెం యాదకుమార్‌ మాట్లాడుతూ... ‘మా చిత్ర ఆడియోకి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. బిజినెస్‌ పరంగా మంచి స్పందన వచ్చింది. మా చిత్రంలో హర్రర్‌తో పాటు స్వచ్ఛమైన ప్రేమ కథ కూడా ఉంటుంది. హీరో  గోపిచరణ్‌, హీరోయిన్‌ ఐశ్వర్య జంట బాగుందంటున్నారు. కెమెరా పనితనం, సంగీతం సినిమాకు హైలైట్స్‌.  ఏ విషయంలో కాంప్రమైజ్‌ కాలేదు. సెన్సార్‌ సభ్యులు ‘ఓ ఫ్రెష్‌ ఫిలిం చూశాము’ అని చెప్పడంతో మాకు సినిమాపై మరింత నమ్మకం వచ్చింది. కచ్చితంగా ఆడియన్స్‌కు నేత్రానందాన్ని కలిగించే విధంగా మా ‘నేత్ర’ చిత్రం ఉంటుంది. ఫిబ్రవరి 3న అత్యధిక థియేటర్లలో గ్రాండ్‌గా  సినిమాను విడుదల‌ చేస్తున్నాం’ అన్నారు.
గోపిచరణ్‌, ఐశ్వర్య హీరో హీరోయిన్లుగా నటిస్తుండగా, స్టార్‌మేకర్‌ సత్యానంద్‌, ఐకె త్రినాధ్‌, ధీరేంద్ర ధీరు, బుగత సత్యనారాయణ, హేమ, రేణుక, రాఘవేంద్ర, ప్రియాంక, సునీల్‌ చరణ్‌, తిరుమరెడ్డి, జబర్దస్త్‌ అప్పారావు, జనార్ధన్‌, గోవర్ధన్‌ తదిత‌రులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఉదయ్‌నాగ్‌ రతన్‌దాస్‌, మాట‌లు: ప్రసాదుల‌ మధుబాబు, కెమెరా:  ఎస్‌.వి. గోపాల్‌, ఎడిటింగ్‌: నర్సింగ్‌ రాధోడ్‌, కొరియోగ్రఫి:  లుక్స్ రాజ‌శేఖ‌ర్‌, బాల‌కృష్ణ, ఫైట్స్‌: బాజీరావు,  నిర్మాత: పీరికట్ల రాము, కథ `  స్క్రీన్‌ప్లే ` దర్శకత్వం: రెడ్డెం యాదకుమార్‌.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com