ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ గెలుచుకున్న ఫెదరర్
- January 29, 2017
ఆస్ట్రేలియా ఓపెన్.. రాడ్లెవర్ ప్రాంగణంలోని ప్రేక్షకులను కనువిందు చేయించింది. టైటిల్‌ను సొంతం చేసుకునేందుకు ఇద్దరు అగ్రశ్రేణి ఆటగాళ్లు రోజర్ ఫెదరర్(17), రఫెల్ నాదల్(9) నువ్వా.. నేనా అనే స్థాయిలో పోటీపడ్డారు. అయిదు సెట్ల పోరులో రోజర్ ఫెదరర్ 6-4, 3-6, 6-1, 3-6, 6-3 తేడాతో రఫెల్ నాదల్‌పై విజయం సాధించి ఆస్ట్రేలియా ఓపెన్‌ను కైవసం చేసుకున్నాడు. దీంతో ఫెదరర్ కెరీర్లో 18వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. సుదీర్ఘ ర్యాలీలతో, పదునైన షాట్లతో ఆద్యంతం ప్రేక్షకులను అలరించారు.
ఆట ఆరంభం నుంచే ఇద్దరూ ఒకరిపై ఒకరు ఆధిక్యం సాధించేందుకు తీవ్రంగా పోరాడారు. మొదటి సెట్‌ను 6-4 తేడాతో రోజర్ తన ఖాతాలో వేసుకున్నాడు. రెండో సెట్లో పుంజుకున్న నాదల్ 6-3తో ఫెదరర్‌పై విజయం సాధించాడు. మూడో సెట్‌ను 6-1 తేడాతో అలవోకగా గెలుచుకున్న ఫెదరర్.. నాలుగో సెట్లో 3-6తో నాదల్కు కోల్పోయాడు. నిర్ణయాత్మకమైన అయిదో సెట్లో 4-3 వద్ద ప్రత్యర్థిని బ్రేక్ చేసిన ఫెదరర్.. 6-3 తేడాతో సెట్‌ను గెలుచుకుని టైటిల్‌ను ఎగరేసుకుపోయాడు. టైటిల్ కోసం వారిద్దరూ 3 గంటల 37 నిమిషాలపాటు పోరాటం చేశారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్‌కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!







