ఇంకెన్నాళ్ళు ఈ ఎడారి సంకెళ్ళు?
- September 15, 2015
డబ్బు కోసం గుడ్డిగా నమ్మి,ఎడారి దేశంలో బానిసలై
ఎన్నో ఎన్నెన్నో బ్రతుకులు..అందవికారంగ మిగిలావి!!
పరదేశంలో ఉండలేక..మన దేశం రాలేక
చచ్చి బ్రతుకుతున్న...బ్రతుకులు ఎన్నెన్నో!!
కూడు గుడ్డ కోసం..కుమిలి కుమిలి----
చస్తున్న జీవితాలు ఎన్నో ఎన్నెన్నో!!
కంట నీరు కరువైన..గుండె పగిలిపోతున్నా
కడ సారి కన్న వాళ్ళను చూసుకోలేని దౌర్భగ్యులు--
ఎందరో ఇంకెందెందరో!!
రక్తం కరిగిపోతుంది...గుండె బరువౌతుంది
కన్న వారు,ఉన్న ఊరు ,కట్టుకున్న ఇళ్ళాలు
చిట్టి చిన్నారులు గుర్తుకొచ్చిన వేళ!!
చచ్చి బ్రతుకుతున్న...కుమిలి కుమిలిపోతున్న
అయిన బ్రతుకుతున్నా...భారతమాత బిడ్డగా
బ్రతుకుతున్నా నే బ్రతుకుతున్నా!!
జై హింద్..శేఖర్.మల్యాల
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







