మీ మట్టి చేతులు ... శుభ్రమైన యూ.ఏ.ఈ.కి దారులు
- September 15, 2015
మొత్తం ఏడు ఎమిరేట్ దేశాలలో జరగనున్న 14 వ "క్లీన్ అప్ యూ.ఏ.ఈ." కాంపైన్, డిసెంబర్ 6 వ తేదీ నుండి 16 వ తేదీ వరకు జరుగుతుందని, నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. ఎమిరేట్స్ ఎన్విరాన్మెంటల్ గ్రూప్ (EEG) ఛైర్ పర్సన్ హబీబా అల్ మరాషీ - ఈ కాంపైన్ దుబాయిలో మొదలై, దిబ్బా-అల్-హిస్న్ లో ముగుస్తుందని ; 2002 లో ప్రారంభమైన ఈ కార్యక్రమం యూ. ఏ. ఈ పర్యంతం వ్యాప్తించి, దేశాన్ని పర్యావరణ హితంగా చేసే లక్ష్యంతో ప్రజలనందరినీ ఏకంచేసే కార్యక్రమంగా మారిందని వివరించారు. ఈ సంవత్సరం లక్ష్యం - ప్రపంచాన్ని మరింత మెరుగైన నివాస ప్రదేశం గా మార్చడానికి కలసి పనిచేయడం అని, ముఖ్యంగా ప్రతి వ్యక్తికి ఆచరణలోకి దిగవలసిన బాధ్యత ఉందని ఆమె తెలిపారు. గత సంవత్సరం ఈ కార్యక్రమంలో 123, 176 మంది అవిశ్రాంతంగా పాల్గొని, 94 టన్నుల పొగుపడిన చెత్తను శుభ్రం చేశారని, ఈ సంవత్సరం మరింత మంది పాల్గొంటారని ఆశిస్తున్నామన్నారు. సమాజంలో ఒక మార్పు తీసుకురావడానికి యూ. ఏ. ఈ. నివాసులకు ఉపయోగపడమే ఈ కార్యక్రమం లక్ష్యమని చెబుతూ కార్యక్రమ కాలెండరును ఈ విధంగా ప్రకటించారు:
డిసెంబరు 5 - దుబాయి
డిసెంబరు 6- రాస్-అల్-ఖైమా
డిసెంబరు 7 - షార్జా
డిసెంబరు 8 - ఆజ్మాన్
డిసెంబరు 9 - అబూ ధబి
డిసెంబరు 10 - అల్ ఐన్
డిసెంబరు 12 - ఉమ్మ్-అల్- క్వ్వైన్
డిసెంబరు 13 - ఫ్యూజైరా
డిసెంబరు 15 - ఫ్యూజైరా లో మొక్కలు నాటే కార్యక్రమం
డిసెంబరు 16- దిబ్బా-అల్-హిస్న్
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







