వ్యాట్‌కి ఫైనల్ అప్రూవల్ ఇవ్వనున్న సౌదీ అరేబియా..
- January 30, 2017
సౌదీ అరేబియా, రీజియన్ వైడ్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ (వ్యాట్)ని ఇంప్లిమెంట్ చేయడానికి సంసిద్ధంగా ఉంది. వచ్చే ఏడాది నుంచి అమల్లోకి రానున్న ఈ వ్యాట్‌కి సంబంధించి ఫైనల్ అప్రూవలని కూడా ఇచ్చేస్తోంది. క్యాబినెట్, ఈ వాల్యూ యాడెడ్ టాక్స్ విషయంలో అప్రూవల్ ఇవ్వడానికి నిర్ణయం తీసుకుందని, ఆరు గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ దేశాల్లో ఇది అమలు కానుందని సమాచారమ్. రాయల్ డిక్రీ కూడా ఈ మేరకు ప్రిపేర్ అయ్యిందని తెలియవస్తోంది. గత జూన్‌లో జరిగిన జిసిసి అగ్రిమెంట్ ప్రకారం, కొన్ని గూడ్స్ విషయంలో ఐదు శాతం లెవీ ఉంటుంది. రెవెన్యూ రైజింగ్ మెజర్స్‌లో భాగంగా ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ రికమండేషన్ ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇంకో వైపున జిసిసి దేశాలు, టొబాకో, సాఫ్ట్ డ్రింక్స్‌కి సంబంధించి సెలక్టివ్ ట్యాక్సెస్‌ని అమలు చేయడానికి నిర్ణయించాయి ఇప్పటికే. గత ఏడాది రికార్డు స్థాయిలో నెలకొన్న రెవెన్యూ డెఫిసిట్ కారణంగా ప్రపంచంలోనే అతి పెద్ద ఆయిల్ ఎక్స్‌పోర్టర్ అయిన సౌదీ అరేబియా, క్యాబినెట్ మినిస్టర్స్ జీతాల్ని తగ్గించడం, అలాగే ముఖ్యమైన బిల్డింగ్ ప్రాజెక్టుల్ని నిలిపివేయడం వంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో నాన్ ఆయిల్ రెవెన్యూని పెంచుకునే దిశగా చర్యలు చేపట్టింది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







