స్మార్ట్ వెహికిల్ ట్రయల్ రన్ పొడిగింపు..
- January 30, 2017
రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (ఆర్‌టిఎ), దుబాయ్ ప్రాపర్టీస్‌తో కలిసి సంయుక్తంగా నిర్వహిస్తున్న అటానమస్ వెహికిల్ ట్రయల్ రన్‌ని, ఫిబ్రవరి 22 వరకు బిజినెస్ బేలో కొనసాగించాలని నిర్ణయించింది. ఈ వాహనానికి వస్తున్న స్పందన నేపథ్యంలో, ట్రయల్ రంగ్ పొడిగించాలని నిర్ణయం తీసుకున్నారు. 10 సీటర్ వెహికిల్, 600 మీటర్ల లాంగ్ ట్రాక్ ద్వారా బిజినెస్ బేలో హల్‌చల్ చేయనుంది. 1500 మంది ఇప్పటికే ఈ వాహనంలో ప్రయాణించి, అద్భుతమైన అనుభూతిని సొంతం చేసుకున్నారు. మొదటి ట్రయల్ ఫేజ్‌లో వరల్డ్ డ్రేట్ సెంటర్ వద్ద, రెండో ట్రయల్ ఫేజ్‌లో మొహమ్మద్ బిన్ రషీద్ బౌలివార్డ్ వద్ద దీన్ని ఏర్పాటు చేశారు. ఈ డ్రైవర్‌లెస్ వాహనం, భవిష్యత్తులో సరికొత్త సంచలనాలకు వేదికవుతుందని నిపుణులు పేర్కొన్నారు. ఇందులో ఆరుగురు కూర్చోవడానికీ, నలుగురు నిల్చోవడానికీ అవకాశముంది. గంటకు 10 కిలోమీటర్ల వేగంతో ఈ వాహనం ప్రయాణిస్తుంది. భద్రత పరంగా అత్యంత విశ్వసనీయమైన వాహనంగా దీన్ని అభివర్ణిస్తున్నారు. అంతర్గత రోడ్లు, ముఖ్యంగా రెసిడెన్షియల్ డిస్ట్రిక్ట్స్‌లో ఈ వాహనాల వినియోగం సత్ఫలితాలనిస్తుందని నిపుణులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







