'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' నటుడు డ్రగ్స్ కేసులో అరెస్టు..
- January 31, 2017
సిద్దార్థ్ నటించిన నువ్వొస్తానంటే నేనొద్దంటానా చిత్రం లో ప్రతినాయకుడి పాత్రలో నటించిన అభిషేక్ కుమార్ గుర్తున్నాడా..? ఇప్పుడు ఈ నటుడు జైలు ఊసలు లెక్కపెడుతున్నాడు..డ్రగ్స్ కేసులో టాస్క్‌ఫోర్స్ పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. వివరాల్లోకి వెళ్తే..
అరకొర చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేసిన అభిషేక్ , ఆ తర్వాత ఛాన్స్ లేవి రాకపోయేసరికి అడ్డదారిన డబ్బు సంపాదించడం మొదలు పెట్టాడు..అభిషేక్, మరో ఇద్దరు విదేశీయులు సహా మొత్తం ఆరుగురు ఓ ముఠాగా ఏర్పడి కొకైన్ విక్రయాలు జరుపుతున్నారు. హైదరాబాద్ వ్యాప్తంగా ఏకంగా 5వేల మంది వరకు కస్టమర్లను ఏర్పాటు చేసుకొని తమ వ్యాపారాన్ని జోరుగా కొనసాగిస్తున్నారు.
పక్క సమాచారం అందుకున్న పోలీసులు ఈ గుట్టును రట్టు చేసి అభిషేక్ సహా ఆరుగురిని సోమవారం అరెస్టు చేశారు.
వారి వద్ద నుంచి 370 గ్రాముల కొకైన్, 12 సెల్ఫోన్లు, ఓ కారు, బైకు, రూ 46 వేల నగదును స్వాధీనం చేసుకొని , వారిపై పీడీ యాక్టు నమోదు చేస్తామని డీసీపీ లింబారెడ్డి పేర్కొన్నారు. దక్షిణాఫ్రికా జాతీయుడు మండేలా జేమ్స్, ఘనా దేశీయుడు డ్రేక్ ఓవెన్ ఇద్దరూ బంధువులు. వసా్త్రల వ్యాపారం పేరుతో బిజినెస్ వీసాపై ముంబై వచ్చారు. ఆ వ్యాపారం మాటున దక్షిణాఫ్రికా నుంచి కొకైన్‌ను ముంబైకి సరఫరా చేసేవారు. అక్కడి నుండి హైదరాబాద్ లోని సినీ నటుడు అభిషేక్ కుమార్, శ్రీనివాసులు అనే వ్యక్తిని పరిచయం చేసుకున్నారు. వీరికి గ్రాము కొకైన్‌ను రూ.3,500కు విక్రయించేవారు. అభిషేక్ కుమార్, శ్రీనివాసులు దాన్ని రూ.4 నుంచి రూ.5 వేలకు అమ్మేవారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







