203 మంది పిల్లలకు పితృవియోగం..
- January 31, 2017
వివాదాస్పద మతబోధకుడు, 130 మంది భార్యలకు భర్త, 203 మంది పిల్లలకు తండ్రి అయిన మొహమ్మద్ బెలో అబూ బకర్ అంతుచిక్కని వ్యాధితో బాధపడుతూ కన్నుమూశారు. 93 ఏళ్ల అబూ బకర్ నైజీరియాలోని బిడా రాష్ట్రంలోగల తన నివాసంలో తుదిశ్వాస విడిచనట్లు ఆయన సహాయకులు ఆదివారం మీడియాకు తెలిపారు.
స్థానికులు 'బాబా'గా వ్యవహరించే అబూ బకర్ పవిత్రగ్రంథానికి వింత భాష్యాలు చెప్పడంతో పాపులర్ అయ్యాడు. ఒక పురుషుడు ఎంతమంది స్త్రీలనైనా వివాహం చేసుకోచ్చనేది ఆయన వాదన.
ఆ క్రమంలో 130 మంది మహిళలను పెళ్లాడిన బకర్.. వారి ద్వారా 203 మంది పిల్లలకు తండ్రి అయ్యారు. రెండంతస్తుల భారీ భవనంలో నివసించే ఆయన కుటుంబం.. ప్రంపంచంలోనే అతిపెద్ద కుటుంబంగా రికార్డులకెక్కింది. కాగా, బకర్ కన్నుమూసేనాటికి ఆయన భార్యల్లో కొంతమంది గర్భవతులు కూడా ఉన్నారు.
2008లో అబూ బకర్.. రెండు గంటల వ్యవధిలోనే 82 మంది భార్యలకు విడాకులు ఇచ్చారు. అప్పట్లో అదొక సంచలన వార్త. పెళ్లిళ్లపై ఉపన్యాసాలు దంచే బకర్.. ఒకేసారి అంతమంది భార్యలకు విడాకులు ఇవ్వడాన్ని ఇతర మతపెద్దలు తీవ్రంగా తప్పుపట్టారు. ఏదిఎలా ఉన్నా, భగవంతుడి ఆదేశాలను పాటించడానికే తాను జన్మించానని బకర్ పలుమార్లు చెప్పుకున్నాడు. చనిపోవడానికి కొద్దిరోజుల ముందు.. దేవుడు తనకు అప్పగించిన పని ముగిసిందని బకర్ అనుచరులతో చెప్పాడట. బకర్ మరణానికి దారితీసిన వ్యాధి ఏమిటనేది తెలియాల్సిఉంది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







