టాప్-10లో ఫెడరర్..
- January 31, 2017
ఇటీవల ముగిసిన ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ స్లామ్ పురుషుల సింగిల్స్ లోవిజేతగా నిలిచిన స్విస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ తన ర్యాంకును మెరుగుపరుచుకున్నాడు. ఆస్ట్రేలియా ఓపెన్ ను గెలిచిన తరువాత ఫెడరర్ టాప్-10లో నిలిచాడు. తాజాగా విడుదల చేసిన ఏటీపీ ర్యాంకింగ్స్ లో ఫెడరర్ పదో స్థానానికి ఎగబాకాడు.
ఆస్ట్రేలియా ఓపెన్ లో తన పూర్వపు ఫామ్ ను అందుకున్న ఫెడరర్.. ఆ టోర్నీలో ఆద్యంత నిలకడగా రాణించి టైటిల్ ను ఎగురేసుకుపోయాడు. ఆదివారం జరిగిన తుది పోరులో ఫెడరర్ 6-4, 3-6, 6-1, 3-6, 6-3 తేడాతో స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ పై విజయం సాధించి గ్రాండ్ స్లామ్ ను సొంతం చేసుకున్నాడు. హోరాహోరీగా సాగిన పోరులో ఫెడరర్ తన అనుభవాన్నిఉపయోగించి నాదల్ కు చెక్ పెట్టాడు.
దాంతో ప్రపంచ ర్యాంకింగ్స్ లో పైకి ఎగబాకాడు. మరొకవైపు మహిళల సింగిల్స్ లో విజేతగా నిలిచిన అమెరికా నల్ల కలువ సెరెనా విలియమ్స్ తిరిగి తన టాప్ ర్యాంకును సొంతం చేసుకుంది. ఈ గ్రాండ్ స్లామ్ కు ముందు రెండో ర్యాంకులో ఉన్న సెరెనా.. టైటిల్ ను కైవసం చేసుకోవడంతో నంబర్ వన్ స్థానానికి చేరింది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







