కొత్త సంప్రదాయానికి నాంది : ప్రధాని మోదీ..
- January 31, 2017
''ఈరోజు ఓ కొత్త సంప్రదాయం ప్రారంభమవుతోంది. మొదటిది, దాదాపు ఒక నెల ముందుగానే బడ్జెట్ వస్తోంది. రెండోది, రైల్వే బడ్జెట్ దీనిలో చేరింది. దీనిపై కూడా చర్చ జరుగుతుంది. వీటి ఫలితాలు రాబోయే రోజుల్లో కనిపిస్తాయి'' అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం చెప్పారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవడానికి ముందు ఆయన మాట్లాడారు. బడ్జెట్ సాయంత్రం 5 గంటలకు ప్రవేశపెట్టే సంప్రదాయం ఉండేదని, అటల్ బిహారీ వాజ్పేయి ప్రధాన మంత్రిగా ఉన్న కాలంలో ఆ సంప్రదాయానికి తెరపడిందని చెప్పారు. ప్రస్తుత సమావేశాలు ప్రయోజనాత్మకంగా జరుగుతాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలకు లబ్ధి చేకూర్చేందుకు అన్ని రాజకీయ పార్టీలు కలిసికట్టుగా కృషి చేస్తాయని ఆశిస్తున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







