ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ 2017 కేంద్ర బడ్జెట్ ముఖ్యాంశాలు...
- January 31, 2017
న్యూఢిల్లీ : కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ బుధవారం లోక్ సభలో 2017-18 ఏడాదికిగాను బడ్జెట్‌ను సమర్పించారు. 92 ఏళ్ల సంప్రదాయాన్ని కాదని తొలిసారి రైల్వే బడ్జెట్‌ను కూడా సాధారణ బడ్జెట్‌లో భాగంగా ప్రవేశపెట్టారు.
కేంద్ర బడ్జెట్ కు సంబంధించిన ముఖ్య అంశాలు :
విద్యారంగానికి ప్రాధాన్యత, యూజీసీలో సంస్కరణలు
విద్యార్థులకు ప్రయోగాత్మకంగా 350 ఆన్‌లైన్ క్లాసులు
ఉన్నత విద్యలో ప్రవేశ పరీక్ష కోసం కొత్త విధానం
యువతలో నైపుణ్యాన్ని పెంచే సంకల్ప్ స్కీమ్ కు రూ.4వేల కోట్లు
ప్రధాని ఆవాస్ యోజన పథకానికి రూ.23 వేలకోట్లు
స్వచ్ఛ భారత్ మిషన్ మంచి ఫలితాలు ఇచ్చింది
ప్రధానమంత్రి సడక్ యోజనకు రూ.19వేల కోట్లు
గ్రామీణ నిరుపేదలకు కోటి పక్కా ఇళ్లు
జాతీయ ఉపాధిహామీ పథకంలో మహిళలకు భాగస్వామ్యం పెంపు
జాతీయ ఉపాధి హామీ పథకానికి రూ.48వేల కోట్లు
నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి
రూ.8వేల కోట్లతో డెయిరీ అభివృద్ధికి ప్రత్యేక ఫండ్
మైక్రో ఇరిగేషన్ కోసం రూ.5వేల కోట్లు
పేదలకు సామాజిక భద్రత, గృహనిర్మాణం, ఉపాధి కల్పన
ఆర్థిక సంస్థల బలోపేతం, డిజిటల్ వ్యవస్థ
భూసార పరీక్షల కోసం కృషి విజ్ఞాన కేంద్రల్లో మినీ ల్యాబ్‌లు
63 వేల ప్రాథమిక సహకార సంఘాల కంప్యూటీకరణ
రూ.10 లక్షల కోట్ల వ్యవసాయ రుణాలు
నాబార్డ్ తో వ్యవసాయ సహకార సంఘాల అనుసంధానం
60 రోజుల్లోపు రుణాలు చెల్లిస్తే రైతులకు పూర్తి వడ్డీ రాయితీ
వచ్చే అయిదేళ్లలో రైతుల ఆదాయం రెట్టింపు అయ్యేలా చర్యలు
గ్రామీణ ప్రాంతాల్లో బడ్జెట్ ను ఎక్కువ ఖర్చు చేస్తాం
పేదరిక నిర్మూలనే మా ప్రధాన లక్ష్యం
ఈ బడ్జెట్ లో మూడు కీలక నిర్ణయాలు తీసుకున్నాం
బడ్జెట్ ను ముందుగానే ప్రవేశపెట్టాం
రైల్వే బడ్జెట్ ను సాధారణ బడ్జెట్ లో కలపడం చారిత్రాత్మకం
ప్రణాళికేతర, ప్రణాళిక వ్యయంపై స్పష్టత ఇచ్చాం
ఈ బడ్జెట్ లో గ్రామీణ ప్రాంతాలు, పేదరిక నిర్మూలనకు పెద్దపీట
మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత
బ్లాక్ మనీపై పోరాటం చేశాం, మా చర్యలకు ప్రజలు మద్దతు తెలిపారు
పారదర్శకత, ఖచ్చితత్వాన్ని పాటించాం
గడిచిన రెండేళ్లుగా అహర్నిశలు కష్టపడుతున్నాం
ప్రజలు మాపై ఎన్నో ఆశలు పెట్టుకుని, మమ్మల్ని గెలిపించారు
రెండంకెల ద్రవ్యోల్బణం అమల్లోకి వచ్చింది
ప్రజా ధనానికి మేము రక్షకులుగా ఉంటాం
వృద్ధిరేటును ప్రోత్సహించేలా చర్యలు తీసుకుంటున్నాం
పారదర్శకత, అవినీతి లేని సుపరిపాలన కోసం గట్టిగా పని చేస్తున్నాం
నల్లధనంపై యుద్ధం ప్రకటించాం, పెద్దనోట్లను రద్దు చేశాం
వ్యవస్థీకృతంగా ఉన్న లోపభూయిష్ట విధానాలకు స్వస్తి చెప్పాం
పరోక్ష పన్నులపై పార్లమెంట్ లో సుదీర్ఘ చర్చ జరిగింది
ప్రపంచ జీడీపీ ఈ ఏడాది పెరుగుతుందని ఐఎమ్‌ఎఫ్ అంచనా వేసింది
సరైన నిర్ణయం ఎప్పటికీ విఫలం కాదని మహత్ముడి ఉద్బోధ
నోట్ల రద్దు అన్నిరకాలుగా మేలు చేసింది
నోట్ల రద్దు, జీఎస్టీ రెండు కీలక నిర్ణయాలు ఆర్థిక వృద్ధికి తోడ్పుడుతాయి
వచ్చే ఆర్థిక ఏడాదిలో జీడీపీ పెరుగుతుంది
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







