విపరీత పోకడలకు పోతే దేశ బహిష్కరణ తప్పదు, కువైట్ వీధులలో క్రీడా వేడుకల్లో నిర్వాసితులు...
- February 01, 2017
కువైట్ : కువైట్ వీధుల్లో క్రీడా విజయాల వేడుకలలో నిర్వాసితులు విపరీత పోకడలకు పోయి ట్రాఫిక్ ఆటంకపర్చడం 'అనైతిక ప్రవర్తన' పాల్పడితే దేశ బహిష్కరణకు ఎదుర్కొక తప్పదని , కువైట్ ఇంటీరియర్ మంత్రిత్వ శాఖ మీడియా మరియు రిలేషన్స్ జనరల్ డైరెక్టరేట్ హెచ్చరించింది. నేరస్థులకు వ్యతిరేకంగా అవసరమైన చట్టబద్ధమైన విధానాలు చేపట్టి అవసరమైతే దేశ బహిష్కరణకు సైతం వెనకాడబోమని ప్రతిజ్ఞ చేశారు. కువైట్ ట్రాఫిక్ చట్టం అనుగుణంగా వ్యవహరించాలని వాహన ట్రాఫిక్ జనరల్ డైరెక్టరేట్ తెలిపారు. ప్రైవేట్ ఊరేగింపులు లేదా సమావేశాలతో పాల్గోని మరొకరికి ట్రాఫిక్ అవరోధాలు కల్గించకూడదని ముఖ్యంగా రాత్రి సమయాలలో ఇతరులకు ఏమాత్రం భంగం కల్గించకూడదని అటువంటివారికి అనుమతి లేదని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు, కువైట్ ట్రాఫిక్ నియమాల ప్రకారంగా సహకరించాలని కువైట్ లో అడుగిడిన కొత్త వ్యక్తులకు మీడియా డైరక్టరేట్ అధికారులు విజ్ఞప్తి చేశారు. నిర్వాసితుల జీవితాలను మరియు ఆస్తి రక్షణను కాపాడాల్సిన నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకొంటున్నట్లు సంబంధిత అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







