మంచు విష్ణుతో 'సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు' సినిమాను తెరకెక్కించిన గవిరెడ్డి దర్శకత్వం...
- February 02, 2017
ఇటీవల లక్కున్నోడు సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చిన మంచు వారబ్బాయి కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్నాడు. అదే జోరులో మరిన్ని సినిమాలకు కమిట్ అవుతున్నాడు. ఇప్పటికే రెండు మూడు ప్రాజెక్ట్ చేతిలో ఉన్న విష్ణు ఇప్పుడు మరో సినిమాను కూడా లైన్ లో పెట్టాడు. తన మార్క్ కామెడీ టచ్ తో తెరకెక్కనున్న ఈ సినిమా ఓ ఇంట్రస్టింగ్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతోంది.
రాజ్ తరుణ్ హీరోగా 'సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు' సినిమాను తెరకెక్కించిన గవిరెడ్డి దర్శకత్వంలో మంచు విష్ణు ఓ సినిమాను అంగీకరించాడు. మేడ మీద అబ్బాయి నవల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. అయితే ఈ టైటిల్ తో అల్లరి నరేష్ హీరోగా అనీష్ కృష్ణ దర్శకత్వంలో ఓ సినిమాను ఎనౌన్స్ చేశారు.
మరి అదే ప్రాజెక్ట్ ఇప్పుడు విష్ణు చేతికి వచ్చిందా..? లేక టైటిల్ ఒకరు, కాన్సెప్ట్ ఒకరు తీసుకున్నారా..? తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
తాజా వార్తలు
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ







