అక్రమ లావాదేవీలు: ఖతార్ బ్యాంకర్‌పై కేసు
- February 02, 2017
దోహాకి చెందిన ప్రముఖ బ్యాంకర్, బోగస్ కంపెనీలను సృష్టించి అక్రమ లావాదేవీలకు పాల్పడుతున్నట్లు గుర్తించి ఆయనపై కేసు నమోదు చేశారు. బోగస్ కంపెనీల పేరుతో ఒప్పందాలు కుదుర్చుకుని, పెద్ద మొత్తంలో సొమ్ముల్ని తన బ్యాంక్ అకౌంట్‌లోకి మార్చుకున్నాడాయన. పెద్ద మొత్తంలో సొమ్ములు, వ్యక్తిగత అకౌంట్‌లోకి ట్రాన్స్‌ఫర్ కావడంతో ఈ విషయం వెలుగు చూసింది. పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఈ మేరకు ఆయనపై అభియోగాలు నమోదు చేసింది. అక్రమ లావాదేవీల కోసం నిందితుడు ఫోర్జరీ డాక్యుమెంట్లను వినియోగించినట్లు ఆరోపణలు వినవస్తున్నాయి. తాను పనిచేస్తున్న సంస్థలపై కుట్రపూరితంగా వ్యవహరించినట్లుగా కూడా అభియోగాలను పబ్లిక్ ప్రాసిక్యూషన్ నమోదు చేసింది. డెన్మార్క్‌లో ఉందని చెబుతోన్న బోగస్ కంపెనీ కోసం 636,683 డాలర్లు, ఆస్ట్రేలియా ఉందని చెబుతోన్న మరో ఫేక్ కంపెనీ కోసం 212,483 డాలర్లు, యూఏఈలో ఉందని చెబుతోన్న కంపెనీ తరఫున 434,766 డాలర్లు తన అకౌంట్‌లోకి మార్చేందుకు ప్రయత్నించాడు. ఆయా కంపెనీలకు అక్రమంగా నిధుల మళ్ళింపు జరిగినట్లుగా విచారణలో తేలింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







