ఒకేసారి పది అణ్వాయుధాలను ప్రయోగించే క్షిపణిని పరీక్షించిన చైనా
- February 02, 2017
ఒకేసారి పది అణ్వాయుధాలను ప్రయోగించే క్షిపణిని చైనా నేడు పరీక్షించింది. దీంతో చైనా క్షిపణి సామర్థ్యంలో మరో ముందడుగు వేసినట్లైంది. డాంగ్‌ఫెంగ్-5సీ పేరుతో క్షిపణి పరీక్షను నిర్వహించింది. పది వేర్వేరు లక్ష్యాలపై దీనిని ఏకకాలంలో ప్రయోగించవచ్చు. ఈ పరీక్షను అమెరికాకు చెందిన రెండు ఇంటెలిజెన్స్ సంస్థలు జాగ్రత్తగా పరిశీలించాయి. షానిక్స్ ప్రావిన్స్‌లోని ది టైయూన్ స్పేస్ లాంచి పాడ్‌పై నుంచి దీనిని ప్రయోగించాయి. ఈ క్షిపణి డమ్మీ వార్‌హెడ్‌లను పశ్చిమ చైనాలోని నిర్దేశిత లక్ష్యాలపై పడేసింది.
1980లో చైనా సైన్యంలో చేరిన డాంగ్‌ఫెంగ్ రకం క్షిపణులకు ఇది ఆధునిక రూపం. దీనిపై అమెరికా స్పందిస్తూ తాము చైనా చర్యలను జాగ్రత్తగా పరిశీలిస్తున్నామని తెలిపింది. సాధారణంగా చైనా వద్ద 250 వార్ హెడ్లు ఉన్నాయని అంచనా. కానీ ఒకేసారి పది ప్రయోగించే సామర్థ్యం ఉన్న క్షిపణిని ప్రయోగించిందంటే 250 కంటే ఎక్కువ వార్‌హెడ్స్ ఉన్నట్టు అంచనా వేస్తున్నారు.
తాజా వార్తలు
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!







