అర్జున్ , జెడి చక్రవర్తి హీరోలుగా...
- February 04, 2017
ప్రముఖ కథానాయకులు అర్జున్ , జెడి చక్రవర్తి హీరోలుగా కృతి కట్వా , దివ్యాసింగ్ హీరోయిన్లుగా సమీర్ ప్రొడక్షన్స్ పతాకం పై సమీర్ దర్శకనిర్మాతగా నిర్మిస్తున్న చిత్రం ' కాంట్రాక్ట్ '. ఈ చిత్రం టైటిల్ , లోగో , టీజర్ ఆవిష్కరణ కార్యక్రమం ఇటీవల హైదరాబాద్ ప్రసాద్ లాబ్స్ లో జరిగింది. టైటిల్ ను హీరో అర్జున్ , లయన్ సాయివెంకట్ ఆవిష్కరించగా లోగోను స్వామిగౌడ్ , మోషన్ పోస్టర్ ను స్వామిగౌడ్ , ప్రతాని రామకృష్ణగౌడ్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా స్వామిగౌడ్ మాట్లాడుతూ.. ' తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం సినిమా పరిశ్రమను ఎంతగానో ప్రోత్సహిస్తుంది. చిన్న సినిమాలకు ధియేటర్స్ దొరక్కపోవడం చాల బాధాకరం. ముఖ్యంగా ఈ సమస్యను కూడా ప్రభుత్వం పరిష్కరించే దిశగా ఆ శాఖ మంత్రి ఐన తలసాని శ్రీనివాస యాదవ్ గారికి అప్పగించడం జరిగింది. ఆ దిశగా ప్రభుత్వం పరిష్కార మార్గాలు అన్వేషిస్తుంది. అదే విధంగా గ్రామా స్థాయి నుండి కూడా ప్రతి సినిమాను ప్రోత్సహించే విధంగా ప్రయత్నాలు చేస్తున్నాం ' అన్నారు. మంత్రి మహేందర్ రెడ్డి మాట్లడుతూ.. ' రెండు తెలుగు రాష్ట్రాల్లో హీరో అర్జున్ కు అభిమానులు ఉన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమను దేశంలోనే అగ్ర స్థానంలో నిలిచేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంది. అర్జున్ కి ఈ సినిమా వంద రోజులు ఆడి ఇంకా ఎక్కువ పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టాలని కోరుకుంటున్నాను ' అన్నారు.
ఆర్.కె.గౌడ్ మాట్లాడుతూ.. ' అర్జున్ గారి ' జోడి నెంబర్. ' నుండి ఆయనతో నాకు సుదీర్ఘమైన అనుబంధం ఉంది. ఇద్దరం మంచి మిత్రులం. ఆయనకు తెలుగు రాష్ట్రాల్లో ఇంతమంది అభిమానులు ఉండడం అభినందనీయం. ఈ సినిమా అన్ని వర్గాల వారిని అలరించి , మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను ' అన్నారు.
హీరో అర్జున్ మాట్లాడుతూ.. ' మొదట నేను పోలీస్ ఆఫీసర్ అవుదామని కరాటే నేర్చుకున్నాను. కానీ అనుకోకుండా కోడి రామకృష్ణ గారి ' మా పల్లెలో గోపాలుడు ' చిత్రంతో హీరోగా ఇంతమంది అభిమానులను సంపాదించుకున్నాను. అందుకు కారణమైన కోడి రామకృష్ణగారికి , తెలుగు అభిమానులకు నా కృతఙ్ఞతలు. ఈ సినిమా కూడా తప్పకుండా తెలుగు వారిని అలరించేలా ఉంటుంది ' అన్నారు.
దర్శకనిర్మాత సమీర్ మాట్లడుతూ.. ' జెడి చక్రవర్తి గారి దగ్గర వర్క్ చేయడం ఆనందంగా ఉంది. ఆయనిచ్చిన ప్రోత్సాహమే ఈ రోజున ఈ సినిమా తీయడానికి కారణమైంది. టీం అందరి సహకారంతో ఈ సినిమాను అద్భుతంగా తీర్చిదిద్దగలిగాను. ఈ సినిమా తర్వాత మరో భారీ బడ్జెట్ చిత్రాన్ని తీయబోతున్నాను ' అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో రాజేంద్రనగర్ ఎమ్యెల్యే ప్రకాష్ గౌడ్ , చేవెళ్ల ఎమ్యెల్యే యాదయ్య , దర్శకుడు వి.సాగర్ , సహ నిర్మాతలు మన్వర్ అలీ , టి.శశిధర్ రావు , సోషిని ఆయినాల , ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ వి.సునీల్ కుమార్ , ఎం.రమేష్ తదితరులు పాల్గొన్నారు. అర్జున్ , జెడి చక్రవర్తి , కృతి కట్వా , దివ్యాసింగ్ హీరో హీరోయిన్లుగా అలీ , ఎంఎస్.నారాయణ , ఘజల్ ఖాన్ , అశోక్ కుమార్ , ఢిల్లీ రాజేశ్వరి , జయ ప్రకాష్ రెడ్డి , ఎంఏ.ఖయ్యుమ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం ; సుభాష్ ఆనంద్ , కెమెరా ; జానీ లాల్ , సమర్పణ ; సంజయ్ గద్వక్ ,, సహ నిర్మాతలు: మన్వర్ అలీ , టి.శశిధర్ రావు , సోషిని ఆయినాల , ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: వి.సునీల్ కుమార్ , ఎం.రమేష్ నిర్మాత , దర్శకత్వం ; సమీర్.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







