తారక్ సినిమాకి హాలీవుడ్ టెక్నీషియన్
- February 04, 2017
ఎన్టీఆర్ హీరోగా బాబి డైరెక్షన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై కల్యాణ్‌రామ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా సీకే మురళీధరన్‌ను ఇటీవల ఎంపిక చేశారు. తాజాగా ఈ సినిమా కోసం మరో గొప్ప హాలీవుడ్ టెక్నీషియన్ ని తీసున్నట్టు సమాచారం. ‘లార్డ్ ఆఫ్ రింగ్స్’, ‘ఐరన్ మ్యాన్’, ‘లైఫ్ ఆఫ్ పై’, ‘రోబో’ వంటి చిత్రాలకు పనిచేసిన టెక్నీషియన్ వాన్స్ హార్ట్వెల్ ఈచిత్రానికి పనిచేస్తున్నట్లు చిత్ర యూనీట్ తెలిపింది. కృత్రిమ అవయవాల సృష్టికర్తగా, మేకప్ మేన్ గా ఆయనకి ఎంతో అనుభవం ఉంది. చిత్ర నిర్మాణ సంస్థ ట్విటర్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేస్తూ వాన్స్ హార్ట్వెల్తో ఎన్టీఆర్ దిగిన ఫొటోను పోస్ట్ చేసింది.
ఎన్టీఆర్ తన కెరీర్లో తొలిసారిగా ఇందులో త్రిపాత్రాభినయం చేయనున్నారు. రాశీఖన్నా ఈ చిత్రంలో ఓ కథానాయిక పాత్ర పోషిస్తున్నారు. ‘జై.. లవ కుశ..’ అనే టైటిల్‌ను ఈ చిత్రానికి పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఎన్టీఆర్ గెటప్స్ కోసమే ఈ టెక్నీషియన్ వాన్స్ హార్ట్వెల్ ను తీసుకుని ఉంటారని చెప్పుకుంటున్నారు. ఇంటర్నేషనల్ ఫేమ్ వాన్స్ హార్ట్వెల్ ను ఈ సినిమా కోసం తీసుకోవడంతో చాలా భారీ చిత్రంగా తెరకెక్కుతున్న విషయం అర్థమవుతోంది.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్‌లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







