గల్ఫ్ లోనూ గర్జిస్తున్న 'సింగం-3'
- February 09, 2017
తమిళ స్టార్ హీరో సూర్య నటించిన సింగం 3 చిత్రం ఎన్నో వాయిదాల తర్వాత ఫిబ్రవరి 9న గ్రాండ్ గా విడుదలైంది. రిలీజైన అన్ని సెంటర్లలో ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ రాగా, కలెక్షన్స్ పరుగులు పెడుతున్నాయి. అయితే తెలుగు రాష్ట్రాలలో చిత్ర రిలిజ్ కొద్దిగా ఆలస్యమైనప్పటికి వసూళ్ళ విషయంలో ఏ మాత్రం కాంప్రమైజ్ కాలేదని తెలుగు ప్రొడ్యూసర్ మల్కాపురం శివకుమార్ తెలిపారు. ఓవర్సీస్ లోను ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తున్నది. గల్ఫ్ ప్రాంతంలో రజినీకాంత్ నటించిన 'కబాలి' తర్వాత అంతటి స్థాయిలో రిలీజ్ అయిన చిత్రం గా సూర్య 'సింగం 3' రికార్డుకెక్కింది. కేరళలో 218 థియేటర్లలో సింగం 3 చిత్రం నడుస్తోండగా, బెంగుళూరులో 317 థియేటర్లలో , ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 26 దేశాల్లో 463 లొకేషన్లలో ఈ సినిమా ప్రదర్శితమవుతోంది.
గురువారం దుబాయ్ లో ప్రీమియర్ షో కి విచ్చేసిన హీరో సూర్య ప్రెస్ మీట్ ఏర్పాటు చేసారు. సింగం సిరీస్ లో భాగంగా హరి తెరకెక్కించిన ఈ చిత్రంలో శృతి హాసన్, అనుష్క కథానాయికలుగా నటించారు. ఈ ఇద్దరు భామలు కూడా తమ నటనతో పాటు గ్లామర్ తో ఆకట్టుకున్నారు.


తాజా వార్తలు
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- మరో మలేసియా విమానం మిస్సింగ్ 11 మంది పై ఉత్కంఠ!







