*ఇంద్రధనుస్సు*

- February 09, 2017 , by Maagulf

*ఇంద్రధనుస్సు*
వేసిన ఒక్కొక్క అడుగే 
ఒక్కో రంగయ్యింది 
పూసిన పున్నమికేమో 
వెన్నెల తోడయ్యింది 
అంతా 
ఏ ముడి వరమో 
ఏ మాటల బలమో
ఏ బొమ్మా వినలేదు 
నీకన్నా మిన్నగా 
ఏ బొమ్మా కనలేదు 
నీకన్నా చల్లగా
నీ అడుగులు వెంటే రాకుంటే 
కాలం కలిసి నడిచేనా
నీవే రెప్పగ తోడే లేకుంటే 
రంగుల కల కలిసేనా
ఓ మెట్టు ఎక్కినపుడు 
ఒలికిపోకుండా 
ఓ మెట్టు జారినపుడు 
బెణికిపోకుండా 
చెలీ ..... 
నీ చల్లని చూపుల్లో 
ఈ దీపం పదిలమే
తోవ తప్పిన అడుగుల మళ్లించి 
తప్పులన్నీ మన్నించి 
సఖీ! తల్లివెట్లా అయినావో!!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com