మాస్క్ పార్కింగ్ ఉల్లంఘనల తగ్గుదల ...
- February 11, 2017
జనరల్ డైరెక్టరేట్, మాస్క్‌ల వద్ద అక్రమ పార్కింగ్‌ని విజయవంతంగా కంట్రోల్ చేయగలిగింది. గత నెలలో ప్రారంభించిన క్యాంపెయిన్ కారణంగా ఈ తరహా ఉల్లంఘనలు 60 శాతానికి పైగా తగ్గినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇమామ్‌లు అలాగే, మాస్క్ పరిసరాల్లో ఉంటున్నవారు అధికారులతో బాగా సహకరిస్తున్నారనీ, ఈ కారణంగా ఉల్లంఘునులను గుర్తించడం తేలికవుతోందని ట్రాఫిక్ డిపార్ట్మెంట్ మీడియా అండ్ అవేర్నెస్ డైరెక్టర్ లెఫ్టినెంట్ కల్నల్ మొహమ్మద్ రది అల్ హజ్రి చెప్పారు. ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయనీ, వెంటనే తాము స్పందిస్తున్నామనీ, తద్వారా పార్కింగ్ ఉల్లంఘనల్ని తగ్గించలగుతున్నామని ఆయన అన్నారు. మాస్క్‌ల మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్తో కలిసి ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ఉల్లంఘనులకు జరీమానాలు విధించడంతో పరిస్థితి అదుపులోకి వస్తోంది. అక్రమ పార్కింగ్లు కూడా తగ్గుముఖం పట్టాయి. ఇంకో వైపున వేగ నియంత్రణ లిమిట్స్ విషయంలో నెలకొన్న కన్ఫ్యూజన్తో వాహనదారులు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని తమ దృష్టికి వచ్చిందని ట్రాఫిక్ డిపార్ట్మెంట్ అధికారులు తెలిపారు. వాటి విషయంలో త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







