రాబోయే రెండు నెలల్లో దాదాపు 30 శాతం ఉద్యోగులకు ఇంటికి...
- February 11, 2017
న్యూఢిల్లీ: దేశీయ ఇ-కామర్స్ సంస్థ స్నాప్‌డీల్ భారీగా ఉద్యోగుల్లో కోత పెట్టనుంది. ఖర్చులను తగ్గించుకునే క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. రాబోయే రెండు నెలల్లో దాదాపు 30 శాతం ఉద్యోగులకు ఇంటికి పంపించేందకు రంగం సిద్ధం చేస్తున్నట్టు రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. ఇటీవల భారీ ఇబ్బందుల్లో పడ్డ స్నాప్ డీల్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. దీంతో వేలమంది ఉద్యోగులు పత్యక్షంగా, పరోక్షంగా ఉపాధిని కోల్పోనున్నారు. ఇప్పటికే ఉద్యోగులకు ఉద్వాసన పలికే ప్రక్రియను ప్రారంభించినట్టు తెలుస్తోంది.
తాజా నివేదికల ప్రకారం వాల్యూయేషన్స్ భారీగా కుంగిపోవడం, పెట్టుబడులు క్షీణిచడంతో ఇబ్బందుల్లో పడ్డ స్నాప్ డీల్ ఉద్యోగులను కుదించుకునేందుకు రడీ అవుతోంది.
ఈ మేరకు టీం మేనేజర్లకు పంపిన అంతర్గత ఈ మెయిల్ సమాచారంలో ఆదేశాలు జారీచేసింది. తమ టీంలోని సభ్యుల సంఖ్యను తగ్గించుకోవాల్సింది కోరింది. ఈ నేపథ్యంలో దాదాపు 40-50 మందిని ఇప్పటికే ఇంటికి పంపించేసింది. దీంతో పాటు స్నాప్ డీల్ డైరెక్ట్ ఉద్యోగులు మరో వెయ్యిమంది దాకా, అలాగే దాదాపు 5వేలకు పైగా క ఉన్న కాంట్రాక్టు ఉద్యోగులు ప్రభావితంకానున్నారు. వీరిలో 30శాతం మంది రోడ్డున పడనున్నారు. గత ఏడాది ఫిబ్రవరిలో కూడా సుమారు 200 మంది ఉద్యోగులను స్నాప్ డీల్ తొలగించింది.
కాగా జపాన్‌కు చెందిన సాఫ్ట్‌బ్యాంకు కార్ప్ స్నాప్‌డీల్‌లో 6.5 బిలియన్ డాలర్ల పెట్టుబడులపై 35 కోట్ల డాలర్ల నష్టాన్ని చవిచూసింది. దీంతో స్నాప్‌డీల్ లో పెట్టిన పెట్టుబడులపై ఆశించిన స్థాయిలో ఫలితాలు అందని నేపథ్యంలో డిసెంబర్‌తో ముగిసిన తొమ్మిది నెలలకు గాను 35 కోట్ల డాలర్లు రైటాఫ్ చేసిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







