మార్చ్ 3న విడుదల కానున్న'చిత్రాంగద'
- February 11, 2017
అందం, అభినయం కలగలిసిన తార అంజలి టైటిల్ పాత్రలో తెలుగు,తమిళ భాషల్లో రూపొందుతున్న చిత్రం చిత్రాంగద. తమిళంలో యార్నీ పేరుతో నిర్మిస్తున్న ఈ హరీజెంటల్ థ్రిల్లర్ కామెడీ చిత్రానికి పిల్ల జమీందార్ ఫేం అశోక్ ఈ చిత్రానికి దర్శకుడు. శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమా అండ్ క్రియేటివ్ డ్రావిడన్స్ పతాకంపై గంగపట్నం శ్రీధర్, రెహమాన్‌లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి. కాగా ఈ చిత్ర ఆడియోను వినూత్న పద్దతిలో ఒక్కొ పాటను ఒక్కొ లైవ్ షోల ద్వారా రిలీజ్ చేస్తున్నాం. మార్చి 3న తెలుగు, తమిళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ ఇప్పటి వరకు ఎవరూ టచ్ చేయని హరీజెంటల్ థ్రిల్లర్ కామెడీ జానర్‌లో రూపొందుతున్న చిత్రమిది. సినిమా ఆద్యంతం ఉత్కంఠగా, ఆసక్తికరంగా వుంటుంది. చిత్రంలో వుండే ట్విస్ట్‌లు ఆడియన్స్‌కు షాక్ గురిచేస్తాయి. కొన్ని అదృశ్య శక్తుల కారణంగా నాయిక జీవితం ఏ విధంగా చిక్కుల్లో పడింది? తనకు ఎదురైన సవాళ్లను అధిగించే క్రమంలో చిత్రాంగదకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? అన్నదే మా చిత్ర ఇతివృత్తం. ఈ హారర్, థ్రిల్లర్‌లో ప్రతి సన్నివేశం ఊహించని మలుపులతో ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతుంది. కథానుగుణంగా ఆమెరికాలోని పలు అందమైన లొకేషన్స్ కీలక ఘట్టాల్ని చిత్రీకరించాంఅన్నారు.జెపీ, సప్తగిరి, రాజారవీంద్ర, సిందుతులానీ,రక్ష, దీపక్, సాక్షిగులాటి, జబర్ధస్త్ సుధీర్, జ్యోతి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సెల్వగణేష్, స్వామినాథన్, ఎడిటర్: ప్రవీణ్‌పూడి, కెమెరా:బాల్‌రెడ్డి (హైదరాబాద్) మరియు, జేమ్స్ క్వాన్, రోహిన్ (యూఎస్‌ఎ), సమర్పణ: టీసీఎస్ రెడ్డి, వెంకట్ వాడపల్లి, కథ-స్క్రీన్‌ప్లే-మాటలు-దర్శకత్వం: అశోక్.జి, నిర్మాతలు: గంగపట్నం శ్రీధర్, రెహమాన్.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







