'అవాక్స్' ప్రేమికుల రోజున ఆకాశంలో...
- February 11, 2017
బెంగళూరు, ఫిబ్రవరి 11: ఈ ప్రేమికుల రోజున అదేనండీ ఫిబ్రవరి 14న భారత వాయు సేన సొంతంగా తయారు చేసిన ఎయిర్ బోర్న్ ఎర్లీ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ (అవాక్స్)ను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ వ్యవస్థ అన్నిరకాల వాతావరణ పరిస్థితుల్లోనూ శత్రుదేశాల క్షిపణులు, విమానాలు, యుద్ధవిమానాలను ముందస్తుగానే గుర్తించి అప్రమత్తం చేస్తుంది. దీంతో పాక్, చైనాలపై గగనతల నిఘా పెరుగుతుంది. రూ.2400 కోట్ల ప్రాజెక్ట్‌లో భాగంగా ఈ అవాక్స్‌ను అభివృద్ధి చేశామని.. మరో వ్యవస్థ కొన్ని నెలల్లో అందుబాటులోకి వస్తుందని డీఆర్‌డీవో చైర్మన్ క్రిస్టోఫర్ చెప్పారు. కొత్త అవాక్స్‌ను బెంగళూరులో జరిగే ఏరో ఇండియా 2017లో ప్రారంభిస్తామని వివరించారు.
పొరుగు దేశాలు పాక్, చైనాలతో పోల్చితే గగన తల నిఘాలో భారత కాస్త వెనుకబడి ఉందని. మనకు కేవలం మూడు అవాక్స్ విమానాలుండగా.. పొరుగు దేశాలకు చాలా ఎక్కువ ఉన్నాయి. చైనాకు 20, పాక్‌కు 8 అవాక్స్ విమానాలున్నాయి.
కొత్తగా అందుబాటులోకి తెచ్చిన అవాక్స్ విమానం 400 కిలోమీటర్ల దూరం వరకు అన్ని వైపులా నిఘా ఉంచగలదు.
తాజా వార్తలు
- రియాద్ విమానాశ్రయం పై దాడి.. 12 మంది మృతి, 309 మందికి గాయాలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!







