'తొలి పరిచయం' పోలవరంలో...
- February 11, 2017
వెంకీ, లాస్య జంటగా పీయూకే ప్రొడక్షన్స పతాకంపై దీపక్‌కృష్ణ నిర్మిస్తున్న చిత్రం 'తొలి పరిచయం'. ఎల్. రాధాకృష్ణ దర్శకునిగా పరిచయమవుతున్నారు. బుధవారం జరిగిన కార్యక్రమంలో నిర్మాత మల్కాపురం శివకుమార్ ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను ఆవిష్కరించారు. దర్శకుడు రాధాకృష్ణ మాట్లాడుతూ ''పెళ్లంటే ఇష్టంలేని ఓ అమ్మాయి, ఓ అబ్బాయి నాలుగు రోజులపాటు ఒకే ఇంట్లో ఉండాల్సి వచ్చినప్పుడు వాళ్ల మధ్య ఏం జరిగిందన్నదే ఈ సినిమా కథ. పోలవరం పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరిపాం. పోస్ట్ ప్రొడక్షన పనులు ముగింపుదశకొచ్చాయి'' అని చెప్పారు. త్వరలో పాటల్ని విడుదల చేస్తామని హీరో వెంకీ తెలిపారు. జనసేన పార్టీ పాటలకు సంగీతాన్నిచ్చిన తనకు సంగీత దర్శకుడిగా ఇదే తొలి చిత్రమని సంగీత దర్శకుడు ఇంద్రగంటి చెప్పారు.
తాజా వార్తలు
- పాస్‌పోర్ట్, రెసిడెన్సీ సేవల్లో సహకారానికి ఖతార్–యూఏఈ చర్చలు..!!
- సౌదీలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం..!!
- సముద్ర భద్రతకు ప్రాధాన్యం.. లాటిన్ అమెరికాతో గల్ఫ్ దేశాల కొత్త బంధం..!!
- మానవ అక్రమ రవాణా నిరోధంలో ఒమన్ కీలక చర్యలు..!!
- రియాద్ విమానాశ్రయం పై దాడి.. 12 మంది మృతి, 309 మందికి గాయాలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్







