తెలుగు కుర్రాడు హాలీవుడ్ 'హీరో'...
- February 12, 2017
తెలుగు కుర్రాడు రోనికి అరుదైన అవకాశం దక్కింది. వెయ్యిమంది అబ్బాయిలను ఆడిషన్ చేయగా.. హాలీవుడ్‌లో కామెడీ మూవీ 'గ్రోయింగ్ అప్ స్మిత్'లో నటించే ఛాన్స్ లభించింది. ఏపీ.. తాడేపల్లిగూడేనికి చెందిన రోని ఈ సినిమాలో స్మిత్ భట్నాగర్ అనే కుర్రాడి పాత్రలో నటిస్తున్నాడు. 1979లో అమెరికాలో పెరిగిన స్మిత్ అనే బాలుడి కథే ఇది. రోని ప్రతిభను షికాగో డైలీ హెరాల్డ్ హైలైట్ చేయగా టైం మ్యాగజైన్ ప్రచురిస్తున్న మూవీ ఆఫ్ ది వీక్‌లోనూ ఇతనికి, ఈ చిత్రానికి మంచి ప్రాధాన్యతనిచ్చారు.
ఇది తన ఫస్ట్ సినిమా అని, జేసన్ లీ, హిల్లరీ బర్టన్ వంటి యాక్టర్లతో నటించడం తన అదృష్టమని పొంగిపోతున్నాడు రోని. కొన్ని టీవీ షోలలో నటించినప్పటికీ తనకు మరింత ట్రైనింగ్ అవసరమని అంటున్నాడు.
1970 ప్రాంతాలనాటి కుర్రాడి మేనరిజాన్ని తాను ఈ సినిమాలో చూపాల్సి ఉందని అంటున్నాడు. స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్‌కి తను ఫ్యాన్ అని, బన్నీ డ్యాన్సులంటే చాలా ఇష్టమని తెలిపాడు. ఇతని తల్లి రజని విజయవాడ నివాసి.
తాజా వార్తలు
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..
- అల్ ఐన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరు..
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి







