ఆన్‌లైన్ ట్రేడింగ్ కేసులో మరో సంచలనం ...
- February 12, 2017
గ్రేటర్ నోయిడా: సంచలనం సృష్టించిన రూ.3700 కోట్ల ఆన్‌లైన్ ట్రేడింగ్ కేసులో రోజుకో విషయం వెలుగుచూస్తోంది. కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న అభివన్ మిట్టల్ గతంలో తన పుట్టిన రోజు సందర్భంగా సినీతారలతో కలిసి ఉన్న ఫొటోలు బయటకు వచ్చిన విషయం విదితమే. అదే తరహాలో.. 150 మంది పంపిణీదారులను ఆస్ట్రేలియా పర్యటనకు తీసుకెళ్లేందుకు సంస్థ ప్రణాళికలు రూపొందించినట్లు అధికారులు తెలిపారు. ఘజియాబాద్‌లోని సంస్థ కార్యాలయంలో ప్రత్యేక దర్యాప్తు బృందం చేపట్టిన తనిఖీల్లో రూ.7కోట్ల విలువైన బ్యాంకు డ్రాఫ్టులు, 32 సీపీయూలను సీజ్ చేసినట్లు యూపీఎస్‌టీఎఫ్ ఏఎస్పీ త్రివేణి సింగ్ వెల్లడించారు.
పూర్తి వివరాలు వచ్చే వరకు దర్యాప్తు కొనసాగుతుందని ఆయన వివరించారు.
పాస్‌పోర్టులు సిద్ధం..
గ్రేటర్ నొయిడాలోని జేపీ గ్రీన్స్‌లో లభించిన 36 పాస్‌పోర్టులను జప్తు చేసినట్లు ఏఎస్పీ త్రివేణి చెప్పారు. అవి డైమండ్, బంగారం పంపిణీదారులకు సంబంధించిన పాస్‌పోర్టులని అభినవ్ మిట్టల్ చెప్పినట్లు పేర్కొన్నారు. సంస్థ ప్రచారంలో భాగంగా మార్చి 13 నుంచి 19వ తేదీ వరకు డిస్ట్రిబ్యూటర్లకు ఆస్ట్రేలియా పర్యటన ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేసినట్లు దర్యాప్తులో తేలిందన్నారు. అంతేకాకుండా స్కై డైవింగ్‌లో గిన్నిస్‌బుక్ రికార్డు సాధించేందుకు నిర్ణయం తీసుకున్నారని, అందుకోసం పుణెకు చెందిన టూర్ ఆపరేటర్‌తో సంప్రదింపులు జరిపినట్లు తెలిసిందన్నారు. ముందస్తు చెల్లింపుల్లో భాగంగా రూ.3కోట్లను చెక్కు రూపేణా ఇచ్చినట్లు కంపెనీ సీఈవో శ్రీధర్ అధికారులకు వెల్లడించారని త్రివేణి వివరించారు.
తాజా వార్తలు
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..
- అల్ ఐన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరు..
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి







