మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్లో ఓ చిత్రం...
- February 12, 2017
హైదరాబాద్ : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్లో ఓ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. పూర్తి గ్రామీణ నేపథ్యంలో నిర్మించనున్న ఈ చిత్రానికి గత కొద్ది రోజులుగా టైటిల్ వేట మొదలైంది. ఈ చిత్రానికి పల్లెటూరి ప్రేమలు అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్టు చెప్పుకున్నారు.
ఆ తర్వాత పల్లెటూరి మొనగాడు అయితే ఎలా ఉంటుందనే ఆలోచన చేసారట. చివరకు తన తండ్రి సొంత గ్రామమైన మొగల్తూరుని టైటిల్ లో వచ్చేలా ..మొగల్తూరు మొనగాడు అని పెడితే బాగుంటుందని ఫిక్స్ అయినట్లు చెప్పుకుంటున్నారు.
ఇప్పటికే విడుదల చేసిన మూవీ ఫస్ట్ లుక్ చూస్తుంటే ఈ సినిమా ఏ టైపులో ఉంటుందో కూడా అంచనా వేయలేకుండా ఉందని చెప్పాలి.
రామ్ చరణ్ రెండు బిందెలు మోస్తున్న కావడి చూస్తుంటే ఈ మూవీ ఎంత డిఫరెంట్‌గా ఉండబోతోందో , పల్లెటూరి వాసనలు గుప్పుమనబోతున్నాయో తెలుస్తోంది. తన కెరీర్లో చెర్రీ 'మగధీర', 'ఆరెంజ్' తర్వాత పక్కా కాన్సెప్ట్ ఒరియెంటెడ్ మూవీ చేస్తున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి.
ఈ సినిమా కోసం మెగా వారసుడు లుక్ పరంగా మేకోవర్ చేయడం విశేషం. గుబురు గడ్డెంతో రామ్ చరణ్ లుక్ సింప్లీ సూపర్బ్ అంటూ అభిమానులు ఇప్పటికే ప్రశంసలు వర్షం కురిపించేస్తున్నారు.
అలాగే ఈ చిత్రం పిరియడిక్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతున్నట్లు వినికిడి. మెత్రిమూవీస్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సుమంతను హీరోయిన్గా ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. సుకుమార్ ఆస్థాన సంగీత దర్శకుడు డిఎస్పీ సర్వాలు సమాకురుస్తున్నాడు.
అలాగే కోనసీమ బ్యాక్ డ్రాప్లో ఈ కథ కొనసాగుతుందనీ.. కోనసీమ కుర్రోడుగా చరణ్ కనిపిస్తాడని సినీవర్గాలు అంటున్నాయి చక్కటి లవ్ స్టోరీ గా చిత్రం ఉండబోతుందని, అప్పటి అంశాలను ఎంత అందంగా సినిమాలోకి ఇమడ్చవచ్చా అనే విషయమై దర్శకుడు తన టీమ్ తో కసరత్తులు చేస్తున్నారట. ఇది రామ్ చరణ్ కు గెటప్ నుంచి అంతా డిఫెరెంట్ గా ఉండబోయే చిత్రం అంటున్నారు.
కథ మొత్తం ఎనభైల్లో సాగుతుందిట. అప్పట్లో అంటే సెల్ పోన్ వంటి అనేక టెక్నాలిజీలు యూత్ కు అందుబాటు లోకి రానీ మంచు పల్లకి రోజుల్లో కథ, కథనం నడుస్తుందిట.
తాజా వార్తలు
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..







