ఫ్యామిలీ హీరో సూపర్ స్టార్ కు విలన్ గా...
- February 12, 2017
సీనియర్ హీరోలందరూ ఇప్పుడు కొత్త రూట్ లు వెతుక్కుంటున్నారు. వయసైపోయిన హీరోలందరూ క్యారెక్టర్ ఆర్టిస్ట్ లుగా మారిపోతుంటే ఇప్పటికీ హ్యండ్సమ్ గా కనిపిస్తున్న సీనియర్ హీరోలు విలన్ రోల్స్ కు సై అంటున్నారు. ఇప్పటికే జగపతిబాబు విలన్ గా ఆకట్టుకోగా ఇప్పుడు మరో సీనియర్ హీరో అదే బాటలో నడిచేందుకు రెడీ అవుతున్నాడు.
ఫ్యామిలీ హీరోగా టాలీవుడ్ లో మంచి విజయాలు సాధించిన శ్రీకాంత్ ప్రస్తుతం హీరోగా ఆకట్టుకోలేక పోతున్నాడు. దీంతో విలన్ గా కెరీర్ ను స్టార్ట్ చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు. అంతేకాదు తొలి సినిమానే ఓ సూపర్ స్టార్ కు ప్రతినాయకుడిగా నటించేందుకు రెడీ అవుతున్నాడు. మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ హీరోగా తెరకెక్కుతున్న మలయాళ సినిమాలో శ్రీకాంత్ విలన్ గా మారుతున్నాడు.
ఈ సినిమాలో శ్రీకాంత్ తో పాటు కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ మరో విలన్ గా నటిస్తున్నాడు.
కెరీర్ స్టార్టింగ్ లో విలన్ గా పలు చిత్రాల్లో నటించిన శ్రీకాంత్, హీరోగా మారాక ఒక్క సినిమాలో కూడా నెగెటివ్ రోల్ లో కనిపించలేదు. ఎక్కువగా ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గరైన ఈ హ్యండ్సమ్ హీరో ఇప్పుడు మరోసారి నెగెటివ్ రోల్ లో నటిస్తుండటంతో ఆ సినిమాపై మాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా హైప్ క్రియేట్ అవుతోంది. ఈ సినిమాతో తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







