మరో వరల్డ్ కప్ భారత్ ఖాతాలో...
- February 12, 2017
బెంగళూరు:అంధుల ట్వంటీ 20 వరల్డ్ కప్ లో డిఫెండింగ్ చాంపియన్ గా బరిలోకి దిగిన భారత్ జట్టు టైటిల్ ను నిలబెట్టుకుంది. ఆదివారం పాకిస్తాన్ తో జరిగిన ఫైనల్లో భారత్ 9 వికెట్ల తేడాతో విజయం సాధించి కప్ ను మరోసారి ఎగురేసుకుపోయింది. పాకిస్తాన్ నిర్దేశించిన 198 పరుగుల లక్ష్యాన్ని భారత్ వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది. భారత్ జట్టు 17.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని అందుకుని లీగ్ దశలో పాక్ పై ఎదురైన ఓటమికి ఘనంగా ప్రతీకారం తీర్చుకుంది. క్రితంసారి పాకిస్తాన్ ను ఓడించి కప్ ను సాధించిన భారత్ అదే పరంపరను కొనసాగించి తుది పోరులో తమకు తిరుగులేదని నిరూపించింది.
భారత్ ఆటగాళ్లలో ఓపెనర్ ప్రకాశ్ జయరామయ్య(99 నాటౌట్) మరోసారి విశేషంగా రాణించి జట్టు విజయంలో ముఖ్య పాత్ర పోషించాడు.
అతనికి జతగా అజయ్ కుమార్ రెడ్డి(43) ఆకట్టుకున్నాడు. మరొక ఆటగాడు కేతన్ పటేల్(26) రిటైర్డ్ హర్ట్ గా పెవిలియన్ చేరాడు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసింది.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







