తదుపరి 2 రోజులలో యు.ఏ.ఈ లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం
- February 12, 2017
దుబాయ్: ఒక వర్షపు రోజుతో నివాసితులు తన దినచర్య ప్రారంభిస్తూ మేల్కొన్నారు మరియు శుభవార్త తెలియచేసే మాదిరిగా ఉంది - వాతావరణ నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం సోమవారం వరకు ఇదే స్థితి కొనసాగుతుందని చెదురుమదురుగా వర్షపాతం కొనసాగుతుందని వారు భావిస్తున్నారు.షార్జా మరియు ఉత్తర ఎమిరేట్స్ అత్యంత ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నాయి. ఉమ్ అల్ క్యువాయిన్ మరియు రస అల్ ఖైమాహ్ ఎమిరేట్స్ సహా తేలికపాటి జల్లులు, ఆదివారం ఉదయం సాధారణ నుంచి మధ్యంతర వర్షపాతం రోజంతా కొనసాగుతుందని భావిస్తున్నారు. ఈ మేరకు వాతావరణ శాస్త్రం మరియు సీస్మాలజీ నేషనల్ సెంటర్ యుఎఇ నీటి ఆవిరి యొక్క ఉపగ్రహ చిత్రాన్ని ఆదివారం ప్రచురించింది.ఈ చిత్రంలో ముదురు, లేత ఆకుపచ్చ రంగుల ప్రాంతాలలు మేఘావృతమైన వాతావరణంని సూచిస్తుంది. ముదురు,లేత నీలం రంగులు ఆర్ద్తత కూడిన చిరుజల్లులు కురుస్తాయని సూచిస్తుంది. పసుపు రంగు కల ప్రాంతాల్లో, ఓ మాదిరి వర్షం చినుకులు పడతాయని తెలియచేస్తున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాలలో మేఘాలు మరియు వర్షాలతో కూడిన వాతావరణ పరిస్థితులు నెలకొంటాయిని బుధవారం వరకు ఇదే తరహాలో అస్థిర వాతావరణం ఉంటుందని వాతావరణ శాస్త్రం జాతీయ కేంద్రం మరియు సీస్మాలజీ శాఖ నివేదించారు. దక్షిణ తూర్పు గాలులు నియంత్రించబడి బలంగా తాకడం వలన యుఎఇ కు మరింత వర్షపాతం దక్కనుంది. తీరప్రాంతాలలో తదుపరి రెండురోజుల్లో ఉష్ణోగ్రతలు పర్వత ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 14 డిగ్రీల సెల్సియస్ కు చేరుకొంటుందని మధ్యాహ్నం సమయంలో 27 డిగ్రీల సెల్సియస్ గా నమోదు కానుంది. అదేవిధంగా పర్వతాలపై ఒక సాపేక్షముగా 8 డిగ్రీల సెల్సియస్ కు తక్కువ స్థాయికి చేరుకొని ఒక చల్లని వాతావరణం నెలకొంటుందని తెలిపింది. అలాగే అక్కడ అధిక స్థాయిలో వేడి వాతావరణం 18 డిగ్రీల సెల్సియస్ వద్దకు చేరుకుంటుంది వాతావరణ శాఖ తెలిపింది. దుబాయ్ నుండి ఫుజైరః రహదారుల స్థితిగతులను వివరిస్తూ ఆదివారం ఉదయం 7 గంటలకు యుఎఇ లో తడితో కూడిన రహదారుల చిత్రాలను యు.ఏ.ఈకి చెందిన తుపాను హెచ్చరికల కేంద్రం ప్రచురించింది.
తాజా వార్తలు
- కరీంనగర్ ఆర్టీసీ-2 డిపోలో మరో ఎలక్ట్రిక్ బస్సులో మంటలు..
- ఢిల్లీ-ముంబై ఎక్స్ప్రెస్వే పై ఘోర ప్రమాదం..ఏడుగురు సజీవ దహనం!
- యూఏఈ విజిట్ వీసాదారులకు కీలక గడువు..
- ఈ నెల 20 నుంచి పార్లమెంట్ సమావేశాలు!
- హెచ్-1బీ భారతీయులకు ఊరట..
- కెనడా విదేశాంగ మంత్రితో సయ్యద్ బదర్ కీలక చర్చలు..!!
- కువైట్ లో అనధికార వాహన స్టిక్కర్లపై హెచ్చరిక..!!
- సౌక్ వాకిఫ్లో మ్యాంగో ఫెస్టివల్ పునఃప్రారంభం..!!
- రాస్ అల్ ఖైమాలో విషాదం..పరీక్షలకు వెళ్తుండగా టీనేజర్ మృతి..!!
- బహ్రెయిన్ లో భద్రతా తనిఖీల వీడియో చిత్రీకరణ..వ్యక్తి అరెస్ట్..!!







