దుబాయ్ కాలువ ద్వారా ఇప్పుడు ఒక సాంప్రదాయ అబ్రా ప్రయాణం
- February 12, 2017
దుబాయ్: సాంప్రదాయ అబ్రాస్ ప్రయాణానికి ఇప్పుడు దుబాయ్ కాలువలో అందుబాటులో ఉన్నాయని రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఆర్.టి.ఎ) శనివారం ప్రకటించింది.ప్రధానంగా 20 సీట్లు గల అబ్రాస్ పర్యాటకులకు అనువుగా ఉంటాయని, ఇందులో ప్రయాణించడానికి ఒక్కొక్కరకి 25 డి హెచ్ టిక్కెట్ల కోసం వసూలు చేస్తారు. స్టేషన్ నుండి షేక్ జాయెద్ రోడ్ వరకు ఇవి అందుబాటులో ఉంటాయి. అబ్రాస్ గంటకు 300 డి హెచ్ అద్దెతో అందుబాటులో ఉంటుంది. ఆర్.టి.ఎ యొక్క పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ యొక్క సి ఈ ఓ అబ్దుల్లా యూసుఫ్ అల్ ఆలీ తెలిపిన వివరాల ప్రకారం దుబాయ్ కాలువలో సంప్రదాయ అబ్రాస్ నిర్వహణ ముఖ్యంగా పర్యాటకుల లక్ష్యంగా ఏర్పాటుచేయబడిందని అలాగే సముద్ర రవాణా సేవలు విస్తరించే ప్రణాళికలలో ఇదో భాగం అని ఆయన తెలిపారు. సంప్రదాయ అబ్రాలో ప్రయాణించడానికి 20 మందికి అవకాశం కల్పించే సామర్థ్యం ఉంది కోరినప్పుడు అందుబాటులోఉంటుంది, ఒక పర్యటనలో కనీసం ఎనిమిది మంది ప్రయాణికులు ఉంటె షేక్ జాయెద్ రోడ్ స్టేషన్ నుండి ప్రారంభమయ్యే ప్రయాణం బాగుంటుందని యూసుఫ్ అల్ ఆలీ తెలిపారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







