షార్జాలో మూడో అంతస్తు నుంచి జారీ కిందపడిన చిన్నారి బాలుడు
- February 12, 2017
షార్జా:ఆకాశ వీధుల్లో నివాసముంటున్నామని ఒకింత బడాయి ఒలకపోసే కొందరు అపార్ట్మెంట్ వాసులు పసిబిడ్డల పట్ల ఎంతో జాగ్రత్త వహించాలి. స్థానిక అల్ తాఉం ప్రాంతంలో ఒక భవనం మూడో అంతస్తు నుంచి 21 నెలల వయసు గల ఒక అరబ్ బాలుడు కిందకు జారిపోయి ప్రస్తుతం చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. శనివారం మధ్యాహ్నం 2 గంటలకు పోలీసులు ఈ ఘటనకు సంబంధించిన ఫోన్ కాల్ అందుకున్నారు వెంటనే స్పందించిన వారు వెంటనే జాతీయ అంబులెన్స్ తో రక్షణ విభాగపు యూనిట్లు సంఘటనాస్థలానికి పంపినట్లు చెప్పారు. ఆ జట్టు వచ్చినప్పుడు, ఆ బాలుడు ఇంకా సజీవంగానే ఉండటంతో ఆ నెలల చిన్నారి బాలుడిని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ కు తక్షణమే తరలించారు. అల్ ఖ్అస్సిమి ఆసుపత్రిలో ఆ పిల్లవాడు మృత్యువుతో పోరాడుతున్నాడు. ఎం .ఎం .ఎం గా గుర్తించిన ఆ బాలుడు అల్ శైబ భవనంలో తన తల్లిదండ్రులతో నివసిస్తున్నాడు. తన తల్లిదండ్రులు ఇంటి లోపల ఉండగా, ఆ బాలుడు పాకుకొంటూ వెళ్ళి భవనంకు చెందిన బాల్కనీలో ఆటలాడుకొంటూ అకస్మాత్తుగా కిందకు జారీ పడిపోయాడు. అల్ ఖ్అస్సిమి ఆసుపత్రి వైద్య సిబ్బంది బాలుడు శరీరం యొక్క అన్ని భాగాలలో ఎముకులు పగుళ్లు బారినపడ్డాయని ఆ చిన్నారి బాలుని జీవితంను కాపాడేందుకు ఒక ప్రత్యేక వైద్య బృందం కేటాయించబడినట్లు సమాచారం. పోలీసులు ఈ ప్రమాదంకు గల కారణం గుర్తించడానికి కేసు విచారణ ప్రారంభించారు. ఎత్తయిన భవనాలలో నివసించే తల్లిదండ్రుల నిర్లక్ష్యం కారణంగా ఈ తరహా ప్రమాదాలు సంభవిస్తాయి.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







