"నా పేరు సూర్య... నా ఇల్లు ఇండియా" అంటోన్న బన్న...
- February 13, 2017
అల్లు అర్జున్ వరస సినిమాలను అంగీకరించి కెరీర్ లో జోరుగా ఉన్నాడు.. ప్రస్తుతం బన్నీ హరీష్ శంకర్ దర్శకత్వంలో 'దువ్వాడ జగన్నాథం' సినిమా చేస్తున్న సంగతి విధితమే.. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకొంటుంది.. వేసవి వినోదంగా సందడి చెయ్యడానికి రెడీ అవుతున్నది.. కాగా ఈ సినిమా పూర్తి అయిన అనంతరం బన్నీ లింగు స్వామి దర్శకత్వంలో తెలుగు, తమిళ ద్విభాషా చలన చిత్రాన్ని చేయనున్నాడు.. కాగా ఈ సినిమా చేస్తున్న సమయంలోనే మరో కొత్త ప్రాజెక్ట్ చేసే విధంగా బన్నీ ప్లాన్ చేసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది.. ఆ ప్రాజెక్ట్ ను ప్రముఖ రచయిత వక్కంతం వంశీ దర్శకత్వంలో ఉండనున్నదట.. ఎన్టీఆర్ కు టెంపర్ వంటి హిట్ కథను అందించిన వంశీ ఎన్టీఆర్ తో మొదటి సినిమాకు దర్శకత్వం వహించాల్సి ఉంది. కానీ ఎందుకనో ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు.. దీంతో వంశీ తన మొదటి సినిమా బన్నితో తెరకెక్కించే యోచనలో ఉన్నాడు.. ఈ సినిమా లగడపాటి శ్రీధర్ నిర్మించనున్నారు అనే టాక్ వినిపిస్తోంది.. అంతేకాదు "నా పేరు సూర్య... నా ఇల్లు ఇండియా" అనే ఆసక్తి కరమైన టైటిల్ కూడా నిర్మించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. కాగా అధికారికంగా ప్రకటన వెలువడల్సి ఉన్నది.
తాజా వార్తలు
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!







