గల్ఫ్ వలసలపై సమగ్ర అధ్యయనం
- February 13, 2017
గల్ఫ్ వలస బతుకుల్లో భరోసా నింపేందుకు తెలంగాణ సర్కారు చర్యలు తీసుకోనుంది. గల్ఫ్ వలస కార్మికుల సమస్యల పరిష్కారం కోసం నూతన ఎన్ఆర్ఐ పాలసీని ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. క్షేత్ర స్థాయిలో ఈ సర్వేకు శ్రీకారం చుట్టగా, రాష్ట్రంలోనే ఫైలెట్ ప్రాజెక్టుగా సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట్ మండలంలోని వెంకటాపూర్ గ్రామాన్ని ఎంపికచేశారు. వెంకటాపూర్ గ్రామాన్ని ఈనెల 10,11 తేదీల్లో ఉస్మానియా యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ అడప సత్యనారాయణ, ప్రవాసమిత్ర స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి మంద భీంరెడ్డి,పరిశోధక విద్యార్థులు సాయికృష్ణ యాదవ్ (ఉస్మానియా యూనివర్సిటీ) త్రిలోక్ చందన్ (హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ) సందర్శించి వలసకార్మికుల వివరాలు సేకరించారు .ఈసందర్బంగా వీరు ఎంపీడీఓ చిరంజీవి, జడ్పీటీసీ తోట ఆగయ్య, స్థానిక ప్రజాప్రతినిధులతో సమావేశమై గల్ఫ్ బాధితుల సమస్యలపై చర్చించారు. దేశవ్యాప్తంగా 60లక్షల మంది, తెలంగాణ నుంచి 10 లక్షల మంది గల్ఫ్‌కు వెళ్ళారని తెలిపారు. గల్ఫ్ వలస కార్మికులను ఆదుకునేందుకు ప్రభుత్వం ఎన్ఆర్ఐ పాలసీ తీసుకురానుందని తెలిపారు. క్షేత్రస్థాయిలో సమస్యలను గుర్తించి వాటికి అనుకూలంగా పాలసీ ప్రవేశపెట్టేందుకు సర్వే చేస్తున్నట్లు తెలిపారు. సర్వేను ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్సెస్ రిసెర్చ్ సంస్థ (ఐసీఎస్ఎస్ఆర్) ఉస్మానియ యూనివర్సిటీ సంయుక్తంగా సర్వే చేస్తున్నారని తెలిపారు. గల్ఫ్ వలసల స్థితిగతులపై అధ్యయనం చేసి నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామన్నారు. కార్యక్రమంలో , ఎంపీటీసీ పులి ఉమరమేష్,మంత్రి కేటీఆర్ వ్యక్తిగత సహాయకుడు గనరాజు, రాజారెడ్డి పాల్గొన్నారు.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







