మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన కమల్ హాసన్...
- February 13, 2017
చెన్నై: రోజురోజుకూ ఉత్కంఠ రేపుతున్న తమిళనాడు రాజకీయ సంక్షోభంపై ప్రముఖ నటుడు కమల్ హాసన్ మారోసారి తనదైన శైలిలో స్పందించాడు. అధికారం చేపట్టడంపై రెండు రకాల అభిప్రాయాలను తెలుపుతూ మహాత్మాగాంధీ సూక్తులను ఉటంకించారు. సోమవారం ఉదయం సామాజిక వేదిక ట్విటర్ ద్వారా స్పందిస్తూ.. ''అధికారం రెండు రకాలు. ఒకటి శిక్ష పడుతుందన్న భయంతో అధికారం చేజిక్కించుకోవడం, రెండోది ప్రేమ పూర్వకంగా చేపట్టడం- మహాత్మాగాంధీ (నేను అనుసరించే హీరో)'' అని ట్వీట్ చేశాడు. ఫలానా అని కమల్ ఎవరి పేరు చెప్పకుండానే ''కచ్చితంగా తమిళనాడులో ప్రస్తుతం జరుగుతున్నది ఇదే'' అంటూ నెటిజన్లు ఇట్టే పసిగట్టేశారు.
తన అభిప్రాయాలను ఎప్పటికప్పుడు నిస్సంకోచంగా వెల్లడించడంపై ఈ సూపర్ స్టార్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ''మీకు సెల్యూట్ చేస్తున్నాం సార్.. ఏళ్ల తరబడి మమ్ముల్ని మోసం చేసిన చాలామంది సూపర్ స్టార్ల కంటే, ప్రస్తుత రాజకీయాలపై కనీసం స్పందిచేందుకు భయపడేవారికంటే మీరు చాలా బెటర్... నేరుగా భయం లేకుండా అభిప్రాయం చెప్పారు'' అంటూ ఓ నెటిజన్ స్పందించాడు.
దివంగత ముఖ్యమంత్రి జయలలిత స్థానంలో సీఎంగా బాధ్యతలు చేపట్టేందుకు ఆమె నెచ్చెలి శశికళ తీవ్రంగా ప్రయత్నిస్తుండగా... జయలలిత విధేయుడు పన్నీర్ సెల్వం కూడా అంతే స్థాయిలో పోరాడుతున్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో బీభత్సం..!!
- టీమ్ ఇండియాలో కొత్త ఆల్‌రౌండర్.. !
- కువైట్‌లో ర్యాష్ డ్రైవింగ్.. ప్రభుత్వ ఆస్తులకు నష్టం..!!
- ఒమన్, అర్మేనియా చర్చలు..పలు కీలక అంశాలపై సమీక్ష..!!
- బహ్రెయిన్ పౌరులకు విద్యుత్, నీటి బిల్లుల్లో ఊరట..!!
- అబుదాబి–రియాద్ విమాన సర్వీసులు రద్దు.. అక్టోబర్ 19 వరకు నిలిపివేత
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం







