రాజేంద్రప్రసాద్ భార్యపై కేసు పెట్టిన సినీ డిస్ట్రిబ్యూటర్...
- February 13, 2017
హైదరాబాద్: ప్రముఖ నటుడు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ భార్య విజయ ఛాముండేశ్వరి కోర్టు చిక్కుల్లో ఇరుకున్నారు. ప్రముఖ సినీ డిస్ట్రిబ్యూటర్ జయభరత్ రెడ్డి విజయ ఛాముండేశ్వరిపై కేసు పెట్టారు.
రూ. 25 లక్షల అప్పుకు సంబంధించి ఏర్పడిన వివాదమే ఈ కేసు పెట్టడానికి కారణం అయింది. ఈ కేసుకు సంబంధించి అందింన వివరాల ప్రకారం విజయ ఛాముండేశ్వరి జయభరత్ రెడ్డి వద్ద 2013లో రూ. 25 లక్షలు అప్పుగా తీసుకున్నారు. డబ్బు తిరిగి ఆరు నెలల్లో తిరిగి ఇస్తానని చెప్పిన ఆమె మాట తప్పినట్లు తెలుస్తోంది.
అప్పు తిరిగి ఇవ్వడంలో భాగంగా చివరకు 2016 జూన్‌లో 10లక్షలు, 15లక్షలు విలువ చేసే రెండు చెక్‌లు ఇచ్చారు.
అవి ఆస్టులో మెచ్యూర్ అవుతాయని చెప్పారు. అయితే ఆ చెక్కులు బౌన్స్ కావడంతో జయభరత్ రెడ్డి కోర్టును ఆశ్రయించారు. ఈ కేసును ఫిబ్రవరి 21న విచారించనున్నారు.
ఇక నటుడు రాజేంద్రప్రసాద్ కెరీర్లో అందరికీ గుర్తుండిపోయే సినిమా 'అప్పుల అప్పారావు'. అందులో అందరి వద్ద అప్పులు చేసి ఎగ్గొట్టే అప్పరావుగా ఆయన అందరినీ నవ్వించింది. అయితే రియల్ లైఫ్ లో రాజేంద్రప్రసాద్ అప్పుకు తీసుకుని కోర్టు చిక్కల్లో ఇరుక్కోవడం ఇండస్ట్రీలో చర్చనీయాంశం అయింది.
తాజా వార్తలు
- ఖతార్లో అక్టోబర్ 16న ‘ఫెస్టివల్ ఆఫ్ వెకేషన్ అండ్ ఫన్’..!!
- యూఏఈలో ఫేస్ మాస్కుల రీకాల్.. నాణ్యత లోపాలపై హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 2026 మిస్క్ గ్లోబల్ ఫోరం రద్దు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో బీభత్సం..!!
- టీమ్ ఇండియాలో కొత్త ఆల్రౌండర్.. !
- కువైట్లో ర్యాష్ డ్రైవింగ్.. ప్రభుత్వ ఆస్తులకు నష్టం..!!
- ఒమన్, అర్మేనియా చర్చలు..పలు కీలక అంశాలపై సమీక్ష..!!
- బహ్రెయిన్ పౌరులకు విద్యుత్, నీటి బిల్లుల్లో ఊరట..!!
- అబుదాబి–రియాద్ విమాన సర్వీసులు రద్దు.. అక్టోబర్ 19 వరకు నిలిపివేత
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన







