కాలిఫోర్నియాలో డ్యామ్ నిర్వాసితులకు అండగా నిలుస్తున్న 'గురుద్వారాలు'
- February 14, 2017
కాలిఫోర్నియాలోని గురుద్వారాలు వందలాది మంది డ్యామ్ నిర్వాసితులకు ఆసరాగా నిలుస్తున్నాయి. ఒరొవిల్లే డ్యామ్ బద్దలయ్యే ప్రమాదం ఉందన్న హెచ్చరికలతో ఆ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీస్తున్నారు. యుబా నగరంలో భారతీయ అమెరికన్లు పెద్ద సంఖ్యలో నివసిస్తుంటారు. డ్యామ్ బద్దలవుతుందన్న వార్తల నేపథ్యంలో సిక్కు మతానికి చెందిన సెక్యూరిటీ గార్డులు, టీచర్లు, రైతులు, ఇతరులు ఆదివారం అర్ధరాత్రి దాటాక పశ్చిమ శాక్రమెంటోలోని రెండంతస్తుల సాహిబ్ సిక్కు మందిరానికి చేరుకుని ఆశ్రయం పొందారు. ఆశ్రయం పొందుతున్న 200 మందికిపైగా నిరాశ్రయులకు మందిరం సిబ్బంది అన్నపానీయాలు, బెడ్డింగ్ సదుపాయాలు కల్పించారు.
19 మంది సిబ్బంది రాత్రంతా మేలుకుని ఉంటూ మందిరానికి చేరకున్న వారికి సేవలు చేసినట్టు మందిరం మేనేజర్ రంజీత్ సింగ్ తెలిపారు.
తాజా వార్తలు
- రియాద్లో మళ్లీ క్షిపణి దాడి.. శకలాలు పడి ప్రవాసికి గాయాలు
- నెట్ఫ్లిక్స్లో భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు షాక్!
- తెలంగాణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలోకి వంగవీటి రాధా
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!







