బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఫుల్ జోష్ లో...

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఫుల్ జోష్ లో...

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ అనందానికి అవదుల్లేకుండా పోయాయి. ట్విటర్ ఖాతాలో ఆయన ఓ మైలురాయిని చేరుకున్నారు. ఈ విషయాన్ని ట్వీట్ ద్వారా తన ఫాలోయర్స్ తో షేర్ చేసుకున్నారు 'బిగ్ బి' అమితాబ్. తన ట్విట్టర్ అకౌంట్లో 25 మిలియన్ల ఫాలోయర్స్ మార్క్ ను చేరుకున్నారు. 'నేను ఈ విషయాన్ని గమనించడం మరిచిపోయాను. 25 మిలియన్లు.. యేహా (మై తో దేఖ్నా బుల్ హి గయా.. 25 మిలియన్లు.. యేహా 25 మిలియన్లు)' అని ట్వీట్ లో రాసుకొచ్చారు అమితాబ్. రెండున్నర కోట్ల ట్విట్టర్ ఫాలోయర్స్ తో అమితాబ్ దూసుకుపోతున్నారు.

కొందరు ప్రముఖుల ట్విట్లర్ ఫాలోయర్లను గమనించినట్లయితే.. ప్రధాని నరేంద్ర మోదీ 2.71 కోట్ల మంది ఫాలోయర్స్ తో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు.
ఆ తర్వాత బాలీవుడ్ ప్రముఖులలో అమితాబ్ 2.5 కోట్ల ఫాలోయర్లతో రెండో స్థానంలో ఉన్నారు. షారుక్ ఖాన్ 2.34 కోట్లు, సల్మాన్ ఖాన్ 2.15 కోట్లు, దీపికా పదుకొనే17.4 కోట్లు, ప్రియాంక చోప్రా 16.3 కోట్ల ఫాలోయర్స్ తో ఉన్నారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని 13.9 కోట్ల మంది ఫాలో అవుతుండటం గమనార్హం. 

Back to Top