పాకిస్తాన్‌లోని లాహోర్ బాంబులతో దద్దరిల్లింది...

పాకిస్తాన్‌లోని లాహోర్ బాంబులతో దద్దరిల్లింది...

పాకిస్తాన్‌లోని లాహోర్ బాంబులతో దద్దరిల్లింది.  సోమవారం సాయిత్రం పంజాబ్ అసెంబ్లీ ప్రాంతం రక్తంతో తడిసి ముద్దయింది.  లాహోర్ నగరంలోని పంజాబ్ అసెంబ్లీ ముందు నిరసన ప్రదర్శన జరుగుతుండగా ఒక వ్యక్తి తనను తాను పేల్చేసుకోవడంతో 16 మంది మరణించగా దాదాపు 60 మందికి పైగా గాయపడ్డారు.  వీరిలో 11 మంది పరిస్థితి విషమంగా ఉందని పంజాబ్ ఆరోగ్య శాఖా మంత్రి సల్మాన్ రఫీక్ తెలిపారు.  పోలీసులే లక్ష్యంగా జరిగిన ఈ దాడుల్లో మృతి చెందిన వారిలో లాహోర్ ట్రాఫిక్ పోలీసు చీఫ్ అహ్మద్ మొబీన్, సీనియర్ ఎస్పీ జహీద్ ఉన్నారని లాహోర్ పోలీస్ కమీషనర్ అమిన్ వైన్స్ చెప్పారు.  తమ సమస్యల్ని పరిష్కరించాలంటూ పార్మా స్యూటికల్స్ తయారీదారులు ఆందోలన నిర్వహిస్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.  ఆందోళనకారులతో చర్చించేందుకు ట్రాఫిక్ పోలీసు చీఫ్ మొబీన్ ప్రయత్నిస్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది.  మోటర్ బైక్‌పై వచ్చిన దుండగుడు తన వాహనాన్ని పోలీసు అధికారుల సమీపంలోకి తీసుకెళ్ళి పేల్చేసుకున్నాడు.  నిఘా సంఘాలు ముందే హెచ్చరించినా పేలుడును అడ్డుకోలేకపోయామని, ముందస్తు చర్యలు తీసుకుంటే ప్రమాదం తప్పి వుండేదని పంజాబ్ న్యాయ శాఖా మంత్రి రానా సనుల్లాహ్ తెలిపారు.  

Back to Top