'పాన్ కార్డు' క్షణాల్లో లభ్యం
- February 15, 2017
ఆదాయపు పన్ను శాఖ జారీచేసే శాశ్వత ఖాతా సంఖ్య(పాన్ కార్డు) కావాలంటే వారాల తరబడి వేచిచూడాల్సిన పరిస్థితికి ఇక చెల్లుచీటి కానుంది. నిమిషాల్లో పాన్ కార్డు ఇక మీ ముందుకు రానుంది. అంతేకాక ఇన్ కమ్ ట్యాక్స్ ను స్మార్ట్ ఫోన్ ద్వారానే చెల్లించేలా అవకాశం కల్పించేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. పన్ను చెల్లింపుదారులకు సులువుగా ఆధార్ కార్డు ఈ-కేవైసీ ఫెసిలిటీ ద్వారా పాన్ కార్డును జారీచేసేలా కేంద్రప్రత్యక్ష పన్నుల బోర్డు ప్రణాళికలు రచిస్తోంది.
ఒకవేళ సిమ్ ను ఈ-కేవైసీ ద్వారా జారీచేస్తే, పాన్ కార్డు కూడా ఇవ్వడం కుదురుతుందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం రెండు, మూడు వారాలు పడుతున్న ఈ పని ఇక ఐదు లేదా ఆరు నిమిషాల్లో ముగించేయొచ్చని పేర్కొంటున్నారు. మొదట నెంబర్ జారీచేసి, తర్వాత కార్డు డెలివరీ చేసేలా చూస్తున్నారు. ఇప్పటికే జతకట్టిన సీబీడీటీ, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖలు కొత్త కంపెనీల స్థాపనకు పాన్ కార్డును నాలుగు గంటల్లో జారీచేసేలా పనిచేస్తున్నాయి.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







