భారత్‌లో అమెరికా ఎంపీల పర్యటన...

- February 15, 2017 , by Maagulf
భారత్‌లో అమెరికా ఎంపీల పర్యటన...

వాషింగ్టన్‌ : అమెరికా చట్టసభ ప్రతినిధులు ఈనెల 20 నుంచి 25 వరకు భారత్‌లో పర్యటించనున్నారని వైట్‌హౌస్‌ పేర్కొంది. రిపబ్లికన్‌, డెమోక్రటిక్‌ పార్టీలకు చెందిన 27 మంది ఎంపీలు పర్యటిస్తారని తెలిపింది. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి ఇలాంటి పర్యటనలు ఉపకరిస్తాయని పేర్కొంది. ఈ విషయాన్ని అమెరికాలో భారత రాయబారి నవ్‌తేజ్‌ సర్నా కూడా ధ్రువీకరించారు.
సర్నా తెలిపిన వివరాల ప్రకారం... అమెరికా ఎంపీలు న్యూఢిల్లీ, హైదరాబాద్‌, బెంగళూర్‌ నగరాల్లో ఆరు రోజులపాటు పర్యటించనున్నారు. 
ప్రభుత్వ అధికారులు, రాజకీయనేతలు, ఎన్‌జీవోలతో సమావేశమవుతారు. భారత్‌కు రానున్న ప్రతినిధుల్లో జార్జ్‌ హోల్డింగ్‌, జాన్‌ స్మిత్‌, డేవ్‌ ట్రోట్‌, శీలా జాక్సన్‌ లీ, హాంక్‌ జాన్‌సన్‌, డెవిడ్‌ సిసిలిన్‌, హెన్రీ క్యూలర్‌ తదితరులున్నారని చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com