"గౌతమ్ నంద" కొత్త పోస్టర్ విడుదల!
- February 24, 2017
మాస్ హీరో గోపీచంద్-స్టైలిష్ డైరెక్టర్ సంపత్ నందిల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సూపర్ స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ "గౌతమ్ నంద". శ్రీబాలాజీ సినీ మీడియా పతాకంపై జె.భగవాన్, జె.పుల్లారావ్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ కు విశేషమైన స్పందన లభించింది. సూపర్ స్టైలిష్ గా కనిపిస్తున్న గోపీచంద్ గెటప్ అందరినీ అలరించింది. నేడు మహాశివరాత్రి సందర్భంగా మరో స్టైలిష్ పోస్టర్ ను విడుదల చేశారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు జె.భగవాన్-జె.పుల్లారావ్ లు మాత్రాడుతూ.. "ఇటీవల విడుదల చేసిన గోపీచంద్ ఫస్ట్ లుక్ పోస్టర్ కు ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందన లభించింది. శివరాత్రి సందర్భంగా సరికొత్త లుక్ ను విడుదల చేశాం.
ఈ సరికొత్త పోస్టర్ లో గోపీచంద్ మరింత స్టైలిష్ గా కనిపించడానికి కారకుడు దర్శకుడు సంపత్ నంది. ప్రతి చిన్న విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకొని గోపీచంద్ క్యారెక్టర్ ను, స్టైలింగ్ ను సరికొత్తగా ఎలివేట్ చేశాడు. ప్రస్తుతం చివరి షెడ్యూల్ జరుగుతోంది. రామ్-లక్ష్మణ్ ల నేతృత్వంలో యాక్షన్ సీక్వెన్స్ లు చిత్రీకరిస్తున్నాం. ఫైట్ సీన్స్ కోసం గోపీచంద్ నాలుగు రోజులపాటు రిహార్సల్ చేయడంతో.. మూడు నిమిషాల యాక్షన్ సీక్వెన్స్ ను సింగిల్ టేక్ లో పూర్తి చేయగలిగాం. తెలుగులో ఈ విధంగా ఒక యాక్షన్ సీక్వెన్స్ ను సింగిల్ టేక్ లో పూర్తి చేయడం అనేది ఇదే ప్రప్రధమం. ఒక హీరోగా గోపీచంద్ కమిట్ మెంట్ కు నిదర్శనం ఇది. మార్చిలో పాటల చిత్రీకరణ కోసం విదేశాలకు వెళ్లనున్నాం" అన్నారు.
హన్సిక, కేతరీన్, నికితన్ ధీర్, తనికెళ్లభరణి, వెన్నెల కిషోర్, అజయ్, ముఖేష్ రుషి తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ప్రొడక్షన్ కంట్రోలర్: బెజవాడ కోటేశ్వర్రావు, స్క్రిప్ట్ కోఆర్డినేటర్: సుధాకర్ పవులూరి, కళ: బ్రహ్మ కడలి, ఫైట్స్: రామ్-లక్ష్మణ్, ఎడిటింగ్: గౌతమ్ రాజు, సినిమాటోగ్రఫీ: ఎస్.సౌందర్ రాజన్, నిర్మాతలు: జె.భగవాన్-జె.పుల్లారావు, కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: సంపత్ నంది!
తాజా వార్తలు
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...







