కువైట్‌కి నేషనల్‌ డే శుభాకాంక్షలు తెలిపిన మోడీ, ప్రణబ్‌

- February 25, 2017 , by Maagulf
కువైట్‌కి నేషనల్‌ డే శుభాకాంక్షలు తెలిపిన మోడీ, ప్రణబ్‌

కువైట్‌ నేషనల్‌ డే మరియు లిబరేషన్‌ డే సందర్భంగా భారత ప్రధాని రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ, ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆ దేశానికి శుభాకాంక్షలు తెలిపారు. ఎమిర్‌ షేక్‌ సబా అల్‌ అహ్మద్‌ అల్‌ జబర్‌ అల్‌ సబా, ప్రైమ్‌ మినిస్టర్‌ షేక్‌ జబెర్‌ అల్‌ ముబారక్‌ అల్‌ హమాద్‌ అల్‌ సబా సహా పలువురు ప్రముఖులకు ఈ శుభాకాంక్షల్ని పంపించడం జరిగింది. ఇరుదేశాల మధ్యా సన్నిహిత సంబంధాలు కొనసాగాలనీ, పలు అంశాల్లో పరస్పర సహకారం ఉండేలా బంధం మరింత బలోపేతమవ్వాలని ఆకాంక్షించారు ఈ సందర్భంగా భారతదేశానికి చెందిన ప్రముఖ నాయకులు. కువైట్‌ ప్రముఖులతోపాటుగా ప్రజలకూ శుభాకాంక్షలు తెలిపారు. ఇండియన్‌ ఎంబసీ సిబ్బంది, ఇండియన్‌ కమ్యూనిటీ తరఫున కువైట్‌ జాతీయులకి, కువైట్‌ ప్రముఖులకి నేషనల్‌ డే, లిబరేషన్‌ డే సందర్భంగా శుభాకాంక్షలు అందించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com