ప్రయాణికులతో వెళ్తున్న ఓ ట్రక్కు అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో 16 మంది మృతి

- February 26, 2017 , by Maagulf
ప్రయాణికులతో వెళ్తున్న ఓ ట్రక్కు అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో 16 మంది మృతి

షిల్లాంగ్‌: మేఘాలయలోని వెస్ట్‌ ఖాసి హిల్స్‌ జిల్లాలో ఆదివారం ఘోర ప్రమాదం సంభవించింది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ ట్రక్కు అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో 16 మంది మృత్యువాత పడ్డారు. 50 మందికి పైగా గాయపడ్డారు. ఓ ట్రక్కులో సుమారు 70 మంది ఓ చర్చికి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న సహాయబృందాలు అక్కడికి చేరుకుని సహాయచర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరలిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com