తెలుగు సినీ పరిశ్రమ మంచి నిర్మాతనే కాదు, మంచి వ్యక్తిని కోల్పోయిందిః నందమూరి బాలకృష్ణ
- February 26, 2017
``ప్రముఖ సినీ నిర్మాత కె.సి.శేఖర్ బాబు కన్నుమూయడం చాలా బాధాకరం. నిర్మాతగా ఎన్నో మంచి చిత్రాలను నిర్మించారు. ఆయన నిర్మాణంలో నేను కూడా సాహస సామ్రాట్ అనే సినిమా చేశాను. నాన్నగారు, స్వర్గీయ ఎన్టీఆర్‌గారితో సినిమా పరంగా ,కుటుంబ పరంగా కూడా తన తండ్రిగారి కాలం నుండి సత్సంబంధాలు ఉన్న వ్యక్తి శేఖర్‌బాబుగారు. తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేకతను సాధించుకున్న శేఖర్‌బాబుగారు ఫిలిం సెంట్రల్ బోర్డ్ చైర్మన్ గా, ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీగా గా పనిచేశారు. ప్రస్తుతం దక్షిణాది ఫిలించాంబర్ కమిటీ మెంబర్ గా సేవలందిస్తూ అందరికీ అందుబాటులో ఉండి కళామతల్లికి సేవ చేసిన వ్యక్తి. శేఖర్ బాబుగారి మరణంతో సినీ పరిశ్రమ మంచి నిర్మాతనే కాదు, ఒక మంచి వ్యక్తిని కోల్పోయినట్టయ్యింది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నాను`` --- నందమూరి బాలకృష్ణ
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







