ఫోన్ రిపేర్ కు ఇచ్చి కస్టాలు పాలైన వినియోగదారుడు
- February 26, 2017
వారంటీ ఇచ్చిన ఓ మొబైల్ ఫోన్ గడువులోపునే మరమత్తుకు వచ్చింది. దాంతో ఓ వినియోగదారుడు కొనుగోలు చేసిన మొబైల్ షాప్ లో చూపించాడు. దాంతో ఆ వ్యక్తికి కష్టాలు మొదలయ్యాయి. సంబంధిత దుకాణంలోని గుమస్తా పాడైన ఫోన్ రిపేర్ చేయించడం లేదు.. పాత ఫోన్ మార్చి కొత్త ఫోన్ ఇచ్చే అవకాశం ఉన్నా ఇవ్వడం లేదు. దీనితో వొళ్ళు మండిన వినియోగదారుడు సుర్ కోర్టు సంప్రదించగా మొబైల్ ఫోన్ దుకాణంలో గుమాస్తాకి మూడు నెలల జైలుశిక్ష 2000 ఒమాన్ రియాళ్ళు జరిమానా విధించింది. ఒక సంవత్సరం వారంటీ తో ఒక వినియోగదారునికి ఒక స్థానిక మొబైల్ ఫోన్ దుకాణం నుండి ఒక కొత్త ఫోన్ ని 240 ఒమాన్ రియాళ్ళు విలువ చెల్లించి కొనుగోలు చేశారు. కొన్ని రోజులు గడిచిన తరువాత ఫోన్ టచ్ స్క్రీన్ విఫలమైంది. దానితో వినియోగదారుడు వారంటీ ఉండటంతో మరమ్మతులు చేయించాలని మొబైల్ ఫోన్ దుకాణం వద్దకు ఫోన్ తీసుకువెళ్లారు. వినియోగదారుల రక్షణ చట్టం ప్రకారం, ఒక వస్తువు మరమ్మతు కోసం పంపిన మూడు వారాల్లో తిరిగి ఇవ్వడం లేదా ఆ వస్తువుకి ఒక కొత్త ఫోన్ ని మార్పిడి చేయాలి. కానీ వినియోగదారుడిని ఇబ్బంది పెట్టి కోర్టు ద్వారా అక్షింతలు పొందారు.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







