గ్యాస్ కు కారణమయ్యే ఆహార పదార్ధాలు

- September 21, 2015 , by Maagulf
గ్యాస్ కు కారణమయ్యే ఆహార పదార్ధాలు

శరీరంలో గ్యాస్ ఉత్పత్తి అవ్వడం అనేది సాధారణ స్థితి. అయితే, ఇది శరీరంలో అధికమైతే అసలైన సమస్య అప్పుడే మొదలవుతుంది . గ్యాస్ ఎక్కువగా ఉత్పత్తి అవ్వడం వల్ల శరీరంలో చాలా అసౌకర్యంగా ఉంటుంది. పొట్టలో అధిక ఆమ్లాలు ఉత్పత్తి కావడం వల్ల తిన్న ఆహారం సరిగా జీర్ణం అవ్వక కడుపు ఉబ్బరంగా, పొట్ట ఉబ్బుకొని, ఉండటం మరియు పొట్ట నొప్పి వంటి అసౌకర్య లక్షణాలను ఎదుర్కోవల్సి వస్తుంది . ఇలాంటి పరిస్థితిల్లో ఎవరిని కలవకపోవడం. నలుగురిలో ఏదైనా తినాలున్నా, తినలేకపోవడం వంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు.పొట్ట ఉబ్బరం..గ్యాస్..ఎసిడిటిని తగ్గించే ఆహారాలు..! కొంత మందిలో భోజం చేసిన వెంటనే ఈ సమస్య కనబడుతుంటుంది . అలాంటి పరిస్థితిలో పొట్టలో గ్యాస్ మరియు ఇతర ఇబ్బందుకు ఎలాంటి ఆహారం కారణం అవుతున్నదో తెలుసుకోవడానికి కష్టం అవుతుంది. అయితే బంగాళదుంపలు, బీన్స్ మరియు కార్న్ వంటి ఆహారాలు గ్యాస్ కు కారణం అవుతాయి.  గర్భాధారణ సమయంలో గ్యాస్ట్రిక్ కు కారణం అయ్యే ఆహారాలు...! కొన్ని ఆహారాలు జీర్ణ అవ్వడానికి చాలా కష్టంగా ఉండి, అవి పొట్టలో జీర్ణం కాక, పొట్టలో గ్యాస్ ఏర్పేలా చేస్తాయి . కొంత మందికి పాలు అలర్జీ ఆహార పానీయంగా ఉంటుంది. పాలలో ఉండే ల్యాక్టోజ్ షుగర్స్ సరిగా జీర్ణం అవ్వక కడుపు ఉబ్బరం మరియు గ్యాస్ సమస్యలకు దారితీస్తుంది. వీటితో పాటు గ్యాస్ కు కారణం అయ్యే మరికొన్ని ఆహారాలను ఈ క్రింది స్లైడ్ ద్వార అందిస్తున్నాము... ప్రొసెస్ చేసిన ఆహారాల్లో షుగర్స్ ల్యాక్టోజ్ మరియు ఫ్రక్టోజ్ అధికంగా ఉంటుంది. ఇది గ్యాస్ కు కారణం అవుతుంది . అంతే కాకుండా . ఈ ఆహారాల్లో అనారోగ్యకరమైన ఆహారాలు చేర్చి ఉండటం వల్ల జీర్ణక్రియకు అంతరాయం కలిగి గ్యాస్ కు కారణం అవుతుంది. చాలా కొద్ది మందిలో మాత్రమే ఈ మొక్కజొన్న గింజలు అరుగుతాయి. కొంత మందిలో ఇవి తినడం వల్ల కడుపు నొప్పి మరియు గ్యాస్ కు కారణం అవుతాయి. కాబట్టి మీ డైయట్ లిస్ట్ నుండి వీటిని తొలగించడం ఉత్తమం. అలాగే క్యాబేజ్ లో కూడా షుగర్స్ మరియు ఫైబర్ అధికంగా ఉండటం వల్ల జీర్ణం అవ్వడానికి చాలా కష్టంగా అనిపించి పొట్ట ఉదరంలో నొప్పికి దారితీస్తుంది. చూయింగ్ గమ్ నమిలేటప్పుడు చాల గాలిని మ్రింగేస్తుంటాము. అది పొట్ట ఉదరంలో చేరి పొట్ట ఉబ్బరం మరియు గ్యాస్ కు దారితీస్తుంది. అంతే కాదు చూయింగ్ గమ్ లోని ఎక్కువ షుగర్స్ ఉండటం వల్ల జీర్ణక్రియ లోపించి గ్యాస్ కు కారణం అవుతుంది. ఓట్స్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది మరియు కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గిస్తుంది . మరియు అదే సమయంలో గ్యాస్ సమస్యలకు దారితీస్తుంది . ఓట్స్ లో ఉండే సోలబుల్ ఫైబర్ ప్రేగుల్లో ఎక్కువ గ్యాస్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. బంగాళదుంపలు స్టార్చ్ తో నిండి ఉంటుంది. ఇది జీర్ణక్రియను ఆలస్యం చేస్తుంది కొలన్ లో బ్యాక్టీరియాన్ ఏర్పరచి తిన్న ఆహారాన్ని జీర్ణం కానివ్వకుండా అడ్డుకొంటుంది. దాంతో గ్యాస్ ఏర్పడుతుంది. మిఠాయిల్లో ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ చేర్చడం వల్ల ఇది గ్యాస్ కు కారణం అవుతుంది. మిఠాయిలు చప్పరించేటప్పుడు ఎక్కవగా గాలిని మ్రింగడం వల్ల గ్యాస్ సమస్యలకు దారితీస్తుంది. బీన్స్ కూడా గ్యాస్ ఉత్పన్నం చేసే ఆహారాల్లో చేర్చారు. ఎందుకంటే వీటిలో గ్యాస్ కు కారణం అయ్యే రఫినోస్ అంశం ఉంటుంది కాబట్టి. అయితే, బీన్స్ పప్పుదాన్యాలు, ఆరోగ్యకరం మరియు పోషకాలు అధికం.బీన్స్ లో వెయ్యికి పైగా రకాలు ఉన్నాయి. వాటిలో ప్రతి ఒకటి వేర్వేరు విధాలుగా ఆరోగ్యవంతముగా ఉంటాయి. బీన్స్ లో జీర్ణం కానీ ట్రిపుల్ స్తచ్యోస్,నాలుగింతల రాఫ్ఫినోస్,ఐదింతల వేర్బస్కస్ అనే చక్కెరలు ఉంటాయి. ఈ చక్కెరలు ఎంజైమ్ లను విచ్ఛిన్నం చేయకపోవుట వలన గ్యాస్ ఏర్పడుతుంది. చాల మంది ల్యాక్టోజ్ ఇంటాలరెన్స్ తో బాధపడుతుంటారు . పాలలో ఉండే లాక్టోజ్ చాలా మందిలో జీర్ణం అవ్వదు. దాంతో గ్యాస్ కు, కడుపు ఉబ్బరానికి కారణం అవుతుంది. ఇంకా లూజ్ మోషన్ కు కూడా కారణం అవుతుంది కార్బొనేటెడ్ పానీయాలు, కోల్డ్ డ్రింక్స్ కడుపు ఉబ్బరానికి మరియు గ్యాస్ట్రిక్ కు కారణం అవుతాయి. అనవసరమైన గాలి జీర్ణ వ్యవస్థలో చేరి జీర్ణక్రియను అడ్డుకొంటుంది. దాంతో జీర్ణక్రియ మందగించి గ్యాస్ ను ఉత్పన్నం చేస్తుంది. కాబట్టి ఇటువంటి పానీయాలను గర్భాధారణలో అవాయిడ్ చేయడం చాలా మంచిది. ఆపిల్స్: యాపిల్స్ జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో చురుకుగా ఉంటుంది. ఇందులో ఉండే పెక్టిన్ అనే అంశం(కార్బోహైడ్రేట్) గ్యాస్ ను ఉత్పన్నం చేస్తుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com