2 నెలలుగా ఆచూకీ లేని ఇండియన్‌ వర్కర్‌

- February 27, 2017 , by Maagulf
2 నెలలుగా ఆచూకీ లేని ఇండియన్‌ వర్కర్‌

రయ్యాన్‌లోని ఓ రరోడ్‌ కన్‌స్ట్రక్షన్‌ ప్రాజెక్ట్‌లో పనిచేస్తున్న 22 ఏళ్ళ వయసున్న భారతీయ వలసదారుడొకరు 70 రోజులుగా కనిపించకుండా పోవడం సంచలనంగా మారింది. తమిళనాడులోని శివగంగ డిస్ట్రిక్ట్‌కి చెందిన మురుగేషన్‌ గోపాలకృష్ణన్‌, స్టీల్‌ ఫిక్సర్‌గా పనిచేస్తున్నాడు. డిసెంబర్‌ 13న వర్క్‌ సైట్‌లో అతన్ని విడిచిపోట్టారు. ఉదయం 5 గంటల సమయంలో రిపోర్ట్‌ చేసినట్లుగా యజమాని ధృవీకరించారు. 10 గంటల సమయంలో గోపాలకృష్ణన్‌ ఆచూకీ గల్లంతయినట్లు గుర్తించారు. గోపాలకృష్ణన్‌ తండ్రి మురుగేశన్‌ సౌదీ అరేబియాలో పనిచేస్తున్నారు. తన కుమారుడి ఆచూకీ కోసం ఆందోళన చెందుతున్నారాయన. సహచరులు పోలీసులను ఆశ్రయించగా, గోపాలకృష్ణన్‌ ఆచూకీ కోసం విచారణ ప్రారంభించారు. దోహాలోని ఇండియన్‌ ఎంబసీతోనూ గోపాలకృష్ణన్‌ కుటుంబ సభ్యులు, సహచరులు టచ్‌లో ఉన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com