ట్యూషన్ ఫీజు పెంచుకునేందుకు 30 పాఠశాలలకు మంత్రిత్వ శాఖ అనుమతి

- February 27, 2017 , by Maagulf
ట్యూషన్ ఫీజు పెంచుకునేందుకు 30 పాఠశాలలకు మంత్రిత్వ శాఖ అనుమతి

కతర్ :  30 కి పైగా ఉన్న ప్రైవేటు పాఠశాలలు మరియు కిండర్ గార్టెన్ పాఠశాలలో 2017-18 విద్యా సంవత్సరంలోవారి ట్యూషన్ ఫీజు పెంచుకోవడానికి విద్యా మంత్రిత్వ మరియు ఉన్నత విద్యాశాఖ అనుమతి    మంజూరు చేసింది. కతర్ లో పాఠశాలల ఫీజు  పెంచుకొనే అవకాశమున్నఆయా పాఠశాలలు జాబితాని ఈ సందర్భంగా విడుదల చేసింది. ఆ జాబితాలోఫిలిపినో ఇంటర్నేషనల్ స్కూల్, ఎస్ ఇ కె  ఇంటర్నేషనల్, ఎం ఇ ఎస్ ఇండియన్ స్కూల్, ది ఫిన్నిష్ పాఠశాల మరియు దోహా కాలేజ్ (వెస్ట్ బే) ఉన్నాయి. అన్ని పాఠశాలలు 1 శాతం నుంచి 15 శాతం వరకు వారు తమ పాఠశాలలో ఫీజు పెంచుకునేందుకు అనుమతి  లభించింది. అదే విధంగా కతర్ లో ఉన్న ప్రభుత్వ అనుమతి ఉన్న కిండర్ గార్డెన్ పాఠశాలలలో ఫీజు పెంచుకొనే అవకాశం ఉంది విద్యా మంత్రిత్వ శాఖ అనుమతి ఉన్నవి కేవలం 38 పాఠశాలలు మాత్రమే ఉన్నాయి. అలాగే  అనుమతి లేని127 సంస్థలకు ఫీజులు పెంచుకునేందుకు వారిని అనుమతించబడరు, పాఠశాలల యాజమాన్యం బహుళ దశల ప్రక్రియ ద్వారా వెళ్ళడానికి అవసరం అని పేర్కొన్నారు. అటువంటి అభ్యర్ధనలు కోసం దరఖాస్తుదారులు గత ఏడాది 31 డిసెంబర్ 1 వ తేదీ నుండి మధ్య కాలంలో అన్ని పాఠశాలలు గత 4 సంవత్సరాల ఆర్థిక నివేదికలు మంత్రిత్వ శాఖకు   సమర్పించాల్సి ఉంది. అపుడే వారు పాఠశాలలో  ఫీజు పెంచాలని అనుమతించబడతారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com